Lavanya Tripathi: అదిరేటి లావణ్యం .. అందాలకు ముగ్ధులవుతున్న నెటిజన్స్

Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి.. ఈ ముద్దుగుమ్మ అందాల రాక్షసి సినిమాతో ఎంతోమంది మనసులలో చెరగని ముద్ర వేసుకుంది. నాని నటించిన భలే భలే మగాడివోయ్, నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది లావణ్య.

Lavanya Tripathi Beautiful Photos
Lavanya Tripathi Beautiful Photos

అందం, టాలెంట్ రెండు ఉన్నా కూడా లావణ్యకు అదృష్టం కలిసి రావడం లేదు. దీంతో హిట్స్ , ఫ్లాప్స్ అనే భేదం లేకుండా సినిమాలు చేస్తుంది. చివరిగా చావు కబురు చల్లగా చిత్రంతో ప్రేక్షకులని పలకరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర నిరాశపరచింది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటున్న లావణ్య త్రిపాఠి తెలుగుతో పాటు తమిళంలోను నటిస్తుంది.

Lavanya Tripathi Beautiful Photos
Lavanya Tripathi Beautiful Photos

ఇప్పటి వరకు 16 చిత్రాల్లో నటించింది లావణ్య. కెరీర్ కు ఉపయోగపడే సినిమా అయితే చేయలేదు. ఈ అమ్మడు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ డిఫరెంట్ ఫొటోస్ షేర్ చేస్తుంది. ఈ ఫొటోలు నెటిజన్స్ మతులు పోగొడుతున్నాయి. తాజాగా క్రీమ్ కలర్ డ్రెస్ లో లావణ్య రెచ్చిపోయి అందాలు ఆరబోసింది. ఇవి నెటిజన్స్ ఆనందానికి అవధులు లేకుండా చేశాయి.

Lavanya Tripathi Beautiful Photos
Lavanya Tripathi Beautiful Photos

హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ తో లావణ్య కెరీర్ మొదలు కాగా, ఆ తరహా పాత్రలే ఆమెకు దక్కాయి. గ్లామర్ పాత్రలు చేస్తే అయినా కెరీర్ మెరుగుపడుతుందని లావణ్య భావిస్తున్నారేమో… సోషల్ మీడియా వేదికగా గ్లామర్ షోకి తెరలేపారు.