Lavanya Tripathi : మెగా ఫ్యామిలీ కండీషన్లు పెట్టిందా.. స్పందించిన లావణ్య..!
NQ Staff - June 14, 2023 / 11:13 AM IST

Lavanya Tripathi : ఇప్పుడు టాలీవుడ్ లో లావణ్య పేరు ట్రెండింగ్ లో ఉంది. గత మూడు రోజులుగా ఎక్కడ చూసినా ఈమె గురించే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఆమె ఇప్పుడు మెగా ఫ్యామిలీకి కాబోయే కోడలు. రీసెంట్ గానే వరుణ్ తేజ్ ను ఆమె ఎంగేజ్ మెంట్ చేసుకుంది. దాంతో ఆమెకు సంబంధించిన అనేక విషయాల వెలుగులోకి వస్తున్నాయి.
ఆమె పుట్టింది ఎక్కడ, ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఇలా అన్నింటినీ ఆరా తీస్తున్నారు. అయితే తాజాగా ఆమెకు మెగా ఫ్యామిలీ కొన్ని కండీషన్లు పెట్టిందని.. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకూడదని చెబితే అందుకు లావణ్య ఒప్పుకున్న తర్వాతనే మెగా ఫ్యామిలీ పెళ్లికి ఒప్పుకుందంటూ వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ వార్తలపై ఇన్ డైరెక్టుగా స్పందించింది లావణ్య. ఆమె పీఆర్ టీమ్ తాజాగా లావణ్య మూడు సినిమాల్లో నటిస్తున్నట్టు తెలిపింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఓ సినిమా చేయడానికి ఇప్పటికే లావణ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. దాని తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్, హాట్ స్టార్ కాంబినేషన్‌లో వస్తోన్న ఓ వెబ్ సిరీస్‌లోనూ లావణ్య నటిస్తుందట.
ఇదే కాకుండా తమిళంలో అథర్వతో ఓ సినిమా చేస్తుందని పీఆర్ టీమ్ ప్రకటించింది. దాంతో లావణ్యకు మెగా ఫ్యామిలీ కండీషన్లు పెట్టిందనేది ఉత్త మాటలే అని తేలిపోయింది. కాగా ఈ సినిమాలు అన్నీ ఎంగేజ్ మెంట్ కు ముందే ఒప్పుకున్నవి. మరి ఇవి చేసిన తర్వాత లావణ్య సినిమాలకు గుడ్ బై చెబుతుందా లేదా అనేది చూడాలి.