Sundeep Kishan: సందీప్ కిషన్ మంచి ‘ఆటగాడు’.. పరువుదీసిన లావణ్య త్రిపాఠి
NQ Staff - March 10, 2021 / 03:58 PM IST

Sundeep Kishan తెర పై హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే తెర వెనకాల హీరో హీరోయిన్ల మధ్య మంచి సఖ్యత ఉండి.. కెమిస్ట్రీ వర్కవుట్ అయితేనే అది తెర పై ప్రతిబింబిస్తుంటుంది. అలా తాజాగా లావణ్య త్రిపాఠి, సందీప్ కిషన్‌లు కలిసి చేసిన ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా సూపర్ హిట్ అయింది.
అంతే కాకుండా మొదటి సారిగా లావణ్య త్రిపాఠి లిప్ లాక్ సీన్ చేసింది. అది కూడా సందీప్ కిషన్‌లాంటి యంగ్ హీరోతో రొమాన్స్‌కు ఓకే చెప్పింది. అలా ఈ ఇద్దరి కెమిస్ట్రీకి కుర్రకారు ఫిదా అయ్యారు. సినిమాలో ఈ ఇద్దరి క్యారెక్టర్స్ మధ్య కెమిస్ట్రీ బాగానే క్లిక్ అయింది. తాజాగా ఈ ఇద్దరూ తమ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సుమ బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ షోలోకి వచ్చారు.
సందీప్ కిషన్ లావణ్య త్రిపాఠి కెమిస్ట్రీ ఎంత బాగున్నా కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అన్నా అనేయడంతో అంతా తారుమారైంది. పొరబాటున అలా అన్నా కూడా కూడా మొత్తానికి అదే హాట్ టాపిక్ అయింది. హీరోను అన్నా అనేసిన లావణ్య త్రిపాఠి అని అందరూ తెగ ట్రోల్ చేసేశారు. అయితే తాజాగా సుమ షోలో లావణ్య త్రిపాఠి హీరో పరువుతీసేసింది.
సందీప్ కిషన్ మంచి ‘ఆటగాడు’..: Sundeep Kishan
నువ్ మంచి ప్లేయర్‌వి అని యాంకర్ రవి కౌంటర్ వేయగా.. అవును సందీప్ కిషన్ మంచి ఆటగాడు అంటూ డబుల్ మీనింగ్‌లో చెప్పేసింది. హేయ్ నువ్ అనుకునే ప్లేయర్‌ని కాదు అంటూ సందీప్ కిషన్ కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే అందరికీ అసలు విషయం అర్థమైపోయింది.