Lavanya: మ‌హేష్ బాబు సర‌స‌న క్రేజీ ఆఫర్ ద‌క్కించుకున్న అందాల ముద్దుగుమ్మ‌

Lavanya: అందాల రాక్షసిగా టాలీవుడ్‌కి పరిచయమై కుర్రకారు మనసు దొచుకుంది లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ భలే భలే మగాడివోయ్.. సోగ్గాడే చిన్ని నాయనా… వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందం.. అభినయంతోపాటు.. సొట్ట బుగ్గలతోనూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది లావణ్య.

lavanya secong heroine in mahesh film
lavanya secong heroine in mahesh film

ఇటీవల చావు కబురు చల్లగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. అంతగా సక్సెస్ కాలేదు. అంతేకాకుండా..ఈ సినిమా తను చేసి ఉండకూడదు అనే విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ అమ్మడు లక్కీ ఛాన్స్ అందుకున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. సూపర్ స్టార్ మహేష్ సరసన నటించే ఛాన్స్ అందుకున్నట్లుగా సమాచారం.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. మహేష్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అందులో హీరోయిన్‏గా లావణ్యను ఎంపిక చేసినట్లుగా టాక్. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా బుట్టబొమ్మ పూజాహెగ్డేను హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కు కూడా ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆ స్థానంలో అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మహేష్ తో రొమాన్స్ చేయనుందని అంటున్నారు.

క‌థలో రెండవ హీరోయిన్ కు కూడా మంచి ప్రాధాన్యత ఉండడంతో మహేష్ సలహా కారణంగా లావణ్య త్రిపాఠిని ఈ ప్రాజెక్ట్ లో సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేశారట మేకర్స్. ప్రస్తుతం మహేష్.. పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

lavanya secong heroine in mahesh film1 (1)
lavanya secong heroine in mahesh film1 (1)

 

ఈ మూవీ తర్వాత మహేష్…త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కనుంది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని బ్యానర్ పై నిర్మించనున్నారు. గతంలో మహేష్.. త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అతడు.. ఖలేజా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. దీంతో మళ్లీ వీరి కాంబోలో సినిమా రాబోతుండడంతో మూవీ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక చాలాకాలంగా హిట్ లేకుండా ఉన్న లావణ్యకు ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.