PAWAN KALYAN: ప‌వ‌న్ హెల్త్ కండీష‌న్ ఏంటి, సినిమాలు ఎప్ప‌టి నుండి చేయ‌నున్నాడు?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొద్ది రోజుల క్రితం క‌రోనాతో చికిత్స పొందిన విష‌యం తెలిసిందే. ఫాం హౌజ్‌లోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ప్ర‌త్యేక చికిత్స చేశారు వైద్యులు. అయితే క‌రోనా నుండి ప‌వ‌న్ క‌ళ్యాణ్ త్వ‌ర‌గానే కోలుకున్న‌ప్ప‌టికీ ఆయ‌న ఊపిరితిత్తులకు ఇన్ఫెక్ష‌న్ సోక‌డంతో ప్ర‌స్తుతం ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. సినిమాలు, రాజ‌కీయాలు వంటి కమిట్‌మెంట్స్ ఏమి లేకుండా నెల రోజుల పాటు ఫాం హౌజ్‌లోనే విశ్రాంతి తీసుకోనున్నారు ప‌వ‌న్. క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత ప‌వ‌న్ చాలా వీక్ అయ్యాడ‌ని, కోలుకోవ‌డానికి కొద్ది స‌మ‌యం ప‌డుతుంద‌ని వైద్యులు చెప్పుకొచ్చారట‌.

ప‌వ‌న్ ప‌లు సినిమాల‌కు సైన్ చేయ‌గా, వాటిని జూన్ నుండి మొద‌లు పెడ‌తాడ‌ట‌. ఇటీవ‌ల వకీల్ సాబ్ చిత్రంతో ప్రేక్ష‌కుల మందుకు వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ రీమేక్ చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తైన త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మూవీ చేయ‌నున్నాడు. వీటితో పాటు ప‌వ‌న్ కళ్యాణ్ మ‌రి కొన్ని సినిమాల‌కు క‌మిట్ అయిన‌ట్టు తెలుస్తుంది. ఏదేమైన ప‌వ‌న్ ఓ సారి కోలుకున్నాడంటే ఇటు రాజ‌కీయాలు అటు సినిమాల‌తో మ‌ళ్లీ ఫుల్ బిజీ కావ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

Advertisement