Lata-mangeshkar: గాన కోకిల ల‌తా మంగేష్క‌ర్‌కి కరోనా.. ఐసీయూలో చికిత్స‌

Lata-mangeshkar: క‌రోనా మ‌హ‌మ్మారి సినీ సెల‌బ్రిటీల‌ను వ‌ణికిస్తుంది. వ‌రుస బెట్టి ప్ర‌ముఖులు అంద‌రు క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా గాన కోకిల ల‌తా మంగేష్క‌ర్ క‌రోనా బారిన ప‌డ్డారు. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలే ఉన్న‌ప్ప‌టికీ వ‌య‌స్సు రీత్యా ఆమెని ముందుస్తుగా ఆసుప‌త్రికి త‌ర‌లించి ఐసీయూలో వైద్యం అందిస్తున్న‌ట్టు స‌మాచారం. ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రు ప్రార్ధిస్తున్నారు.

lata-mangeshkar tested corona postive
lata-mangeshkar tested corona postive

మెలొడీ క్వీన్ లతా మంగేష్కర్ గాత్రం అమృతంలా ఉంటుంది. ఆమె చేత పాటలు పాడించుకోవాలని కోరుకోని సంగీత దర్శకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. దాదాపుగా అన్ని భాషల్లోనూ ఆమె పాటలు పాడారు. తన కెరీర్‌లో దాదాపు 26వేలకు పైగా పాటలు పాడారు. వాటిలో ఎక్కువగా హిందీ పాటలే ఉన్నాయి.

కానీ తెలుగులో ఆమె కేవలం మూడు పాటలే పాడటం మన దురదృష్టం. తెలుగులో ఆమె ఎక్కువ పాటలు పాడకపోవడానికి కారణం ఆమెకే తెలియాలి. 1955లో వచ్చిన ‘సంతానం’ సినిమాలోని ‘నిదురపోరా తమ్ముడా’, ‘దొరికితే దొంగలు’ సినిమాలోని ‘శ్రీ వేంకటేశా..’, 1988లో వచ్చిన ‘ఆఖరి పోరాటం’ సినిమాలోని ‘తెల్లచీరకు’ పాటలు ఆలపించారు.

వయసు తొంబైలో పడిన లత గాన మాధుర్యంలో ఎలాంటి మార్పు లేదు. అది యుగళ గీతమైనా…జానపదమైనా…గజల్ గానమైనా..ఖవ్వాలి రాగమైనా ….భక్తి గీతమైనా ఆమె గొంతులో అలవోకగా సాగాల్సిందే… ఎలాంటి సాహిత్యానికైనా తన స్వరంతో పట్టంకట్టే అపురూప గాన గీతికే లతా మంగేష్కర్.

ఎన్నో అద్భుత గీతాలకు తన స్వరంతో ప్రాణ ప్రతిష్ఠ చేసిన లతా మంగేష్కర్…1929 సెప్టెంబర్ 28న మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జన్మించింది. తల్లిదండ్రులు దీనానాథ్ మంగేష్కర్, శుద్దమతిలకు మొదటి సంతానం ఆమె. మాటలే వచ్చేవయసునుండే పాటలను నేర్చిందీ ఈ గానకోకిల. చిన్నప్పుడే తండ్రి దగ్గర సంగీతంలో ఓనమాలు నేర్చుకుంది. ఆ తర్వాత ప్రముఖ హిందుస్థానీ సంగీత విద్వాంసులు అమన్ అలీ ఖాన్, అమానత్ అలీ ఖాన్ శిష్యరికం చేసింది.. 13 ఏళ్ల వయసులోనే తండ్రి చనిపోవడంతో అప్పటినుండే కుటుంబ పోషణా భారం లతాజీపై పడింది.

lata-mangeshkar tested corona postive
lata-mangeshkar tested corona postive

హిందీ చిత్రసీమలో ప్రముఖ సంగీత దర్శకులందరితో పాట పాడిన ఘనత ఆమె సొంతం. ఎస్.డి. బర్మన్, ఆర్.డి. బర్మన్, లక్ష్మీ కాంత్ ప్యారేలాల్ వంటి అగ్ర సంగీత దర్శకులందరితో కలిసి లెక్కలేనన్ని పాటలు పాడారు లతా మంగేష్కర్.లతా మంగేష్కర్ మొదటి సారిగా మరాఠి మూవీలో పాడారు.