Lasya :  నా పిచ్చిని భరించే వ్యక్తివి నువ్వే.. భర్తపై లాస్య ఇంట్రస్టింగ్ కామెంట్స్

NQ Staff - March 16, 2023 / 08:25 PM IST

Lasya :  నా పిచ్చిని భరించే వ్యక్తివి నువ్వే.. భర్తపై లాస్య ఇంట్రస్టింగ్ కామెంట్స్

Lasya  : బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ గా సుపరిచితురాలైన లాస్య ఇటీవలే రెండవ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింతగా పాపులారిటీని సొంతం చేసుకున్న లాస్య ఈ మధ్య కాలంలో భర్త మంజునాథ్‌ తో కలిసి యూట్యూబ్ మరియు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.

Lasya Wished Husband Manjunath On Birthday In Different Way

Lasya Wished Husband Manjunath On Birthday In Different Way

భర్త పై ఎప్పటికప్పుడు తన ప్రేమాభిమానాలని చూపిస్తూ వీడియోలు చేస్తూ ఉండే లాస్య తాజాగా తన భర్తకి పుట్టిన రోజు శుభాకాంక్షలను విభిన్నంగా చెప్పింది. నా భర్త గురించి నేను ఎప్పుడూ గర్వపడుతూనే ఉంటాను, నా పిచ్చితనాన్ని క్షమించే ఏకైక వ్యక్తి మంజునాథ్ అన్నట్లుగా కామెంట్‌ చేసింది.

Lasya Wished Husband Manjunath On Birthday In Different Way

Lasya Wished Husband Manjunath On Birthday In Different Way

నువ్వు నన్ను నవ్వించావు, నా కన్నీళ్లు తుడిచావు, నన్ను గట్టిగా హత్తుకున్నావు.. నా సక్సెస్ వెనక నిలిచావు. నా వైఫల్యాలను చూశావు, నన్ను స్ట్రాంగ్ గా మార్చావు అంటూ మంజునాథ్ పై లాస్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. లాస్య భర్త మంజునాథ్ కి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెటిజన్స్‌ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us