Lasya: భర్తకు అదిరిపోయే గిఫ్ట్.. అందులోనే సంతృప్తి అంటోన్న యాంకర్ లాస్య

Lasya ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఫుల్ జోరు మీదున్నారు. ఒక్కొక్కరు కార్లు, ఇళ్లు కొనుక్కుంటూ దుమ్ములేపుతున్నారు. నాల్గో సీజన్ కంటెస్టెంట్లలో చాలా మంది ఇప్పటికే బాగా సెటిల్ అయిపోయారు. స్టార్ సినిమాల్లో అవకాశాలు, పలు ప్రాజెక్ట్‌లు చేతుల్లో పడటంతో అందరూ బాగానే సంపాదిస్తున్నారు. అందుకే ఇళ్లు, కార్లు అంటూ కొత్త కొత్త సంతోషాలను కొని తెచ్చుకుంటున్నారు.

తాజాగా సోహెల్ ఓ కొత్త కారును కొనుక్కున్నాడు. అది తన కల అంటూ తండ్రి, సోదరుడితో కలిసి పంచుకున్నాడు. కారుతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. తాజాగా లాస్య కూడా ఓ కారును కొంది. కానీ అది తన కోసం కాదట. తన భర్తకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చానని చెప్పుకొచ్చింది.

అందులోనే సంతృప్తి అంటోన్న యాంకర్ లాస్య : Lasya

కొత్త కారు కొన్నాం.. మొత్తానికి మా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ వచ్చింది.. మా ఇంటికి కొత్త కారు వచ్చింది.. స్పెషల్ రోజును ఇలా స్పెషల్‌గా గిఫ్ట్‌లు ఇస్తే వచ్చే సంతృప్తిని మాటల్లో చెప్పలేం.. ఇక ఇప్పుడు మేం ఈ కారులో లాంగ్ డ్రైవ్‌కు వెళ్తున్నాం.. మా వీడియోను మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నామని లాస్య చెప్పుకొచ్చింది.

మొత్తానికి నాల్గో సీజన్ ద్వారా అందరూ బాగానే సంపాదించినట్టు కనిపిస్తోంది. గంగవ్వకు ఇళ్లు, సోహెల్‌కు ప్రైజ్ మనీతో పాటు రెమ్యూనరేషన్ ఇలా బాగానే వచ్చినట్టుంది. ఇక లాస్యకు బిగ్ బాస్ కంటెస్టెంట్లందరి కంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ వచ్చిందనే వార్తలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఇప్పుడు కారు కొన్న ఆనందంలో లాస్య గాల్లో తేలిపోతోంది.