Lalitha Jewelery : లలితా జ్యుయెలర్స్ ఓనర్ కిరణ్ ‘గుండు’ కథ తెలిస్తే షాకవ్వాల్సిందే.!

NQ Staff - September 19, 2022 / 11:00 AM IST

159420Lalitha Jewelery : లలితా జ్యుయెలర్స్ ఓనర్ కిరణ్ ‘గుండు’ కథ తెలిస్తే షాకవ్వాల్సిందే.!

Lalitha Jewelery : ‘డబ్బులు ఎవరికీ ఊరకే రావు..’ అంటారాయన.! పరిచయం అక్కర్లేని పేరాయనది. ఆయనే ‘లలితా జ్యుయెలర్స్’ కిరణ్. ఆయనకి ఇంకో నిక్ నేమ్ కూడా వుంది.. గుండు బాస్ అని.! ఎప్పుడూ నున్నని గుండుతోనే కనిపిస్తారాయన. ‘నేనేమీ పుట్టుకతో కోటీశ్వరుడ్ని కాదు. పేద కుటుంబం నుంచే వచ్చాను.. కష్టపడి, ఈ రంగంలో రాణించాను..’ అంటారు కిరణ్.

Lalitha Jewelery Kiran Boiled Head News

Lalitha Jewelery Kiran Boiled Head News

ఇంతకీ, కిరణ్ గుండు వెనుక అసలు కథేంటి.? ఆయన ఈ విషయమై ఆసక్తికరమైన విషయం వెల్లడించారు.
మొదట్లో జుట్టు బాగానే వుండేదట.. తనకు జుట్టు మొదట్లో బాగానే వుండేదనీ, అయితే ఎవరూ ‘నీ జుట్టు బావుంది..’ అని అనలేదనీ, ఓ సారి తిరుపతికి వెళ్ళి వచ్చాక, ‘మీకు గుండు చాలా బావుంది..’ అని చాలామంది చెప్పారనీ న్యూస్ క్యూబ్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు కిరణ్.

‘జుట్టు బాగా వున్నప్పుడు ఎవరూ నన్ను మెచ్చుకోలేదు. గుండు గీయించుకున్నాక నన్ను అందరూ మెచ్చుకున్నారు. ఏమో, ఈ గుండు వల్లనే మరింత పేరు ప్రఖ్యాతులు వస్తాయేమో అనుకున్నాను. దాని వల్ల అని కాదుగానీ.. అదొక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చింది. అందుకే దాన్ని కొనసాగిస్తున్నాను..’ అని కిరణ్ తన గుండు కథ బయటపెట్టారు.

అతి తక్కువ కాలంలోనే అత్యంత ఉన్నత స్థాయికి జ్యుయెలరీ బిజినెస్‌లో ఎదిగారు కిరణ్. తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశవ్యాప్తంగా స్టోర్లు నెలకొల్పుతూ వస్తున్నారు లలితా జ్యుయెలరీస్ కిరణ్.