Lakshmi Manchu: శ్రియ‌కు బిడ్డ‌పుట్టిన విష‌యం తెలిసి మంచు వారమ్మాయి ఎలా స్పందించిందో తెలుసా?

Lakshmi Manchu: 2018లో రష్యన్‌ క్రీడాకారుడు, బిజినెస్‌ మ్యాన్‌ ఆండ్రీ కోషీవ్‌ను పెళ్లాడిన శ్రియ రీసెంట్‌గా అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయే విష‌యం వెల్ల‌డించింది. 2020 లాక్‌డౌన్‌ సమయంలోనే ఆమె బిడ్డకు జన్మనివ్వగా.. ఆ విషయాన్ని ఇంతకాలం దాచిపెట్టారు. రీసెంట్‌గా త‌న సోష‌ల్ మీడియా పోస్ట్ ద్వారా .. ‘2020 లాక్‌డౌన్‌ సమయంలో ప్రపంచమంతా ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంది. చాలామంది ఎంతో బాధపడ్డారు. కానీ, అదే లాక్‌డౌన్‌ కాలం మా జీవితంలో సరికొత్త రంగుల్ని నింపింది. సంతోషాన్ని అందించింది అని పేర్కొంది.

Lakshmi Manchu Expressed her Hapiness over Shriya Saran Motherhood
Lakshmi Manchu Expressed her Hapiness over Shriya Saran Motherhood

జీవితంలో అత్యంత ముఖ్యమైన, ఆనందకరమైన విషయాన్ని ఇలా రహస్యంగా ఉంచడంపై ఫ్యాన్స్‌ కాస్తా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే శ్రియ ప్రెగ్నెన్సీని దాచడంపై మంచు వారి అమ్మాయి లక్ష్మి ప్రసన్న కూడా స్పందించింది. శ్రియ పోస్ట్‌ను ఆమె రీట్వీట్‌ చేస్తూ.. ఇది ఎప్పటికి గొప్ప శుభవార్త అంటూ శుభాకాంక్షలు తెలిపింది. ‘

శుభవార్త చెప్పావు శ్రియ. ఆనందకరమైన మాతృత్వాన్ని అనుభవించాలని కోరుకుంటున్నా. ఆడ బిడ్డకు జన్మనివ్వడం ఈ ప్రపంచంలోనే అతి గొప్ప విషయం. నీకు దేవుడు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నా. అలాగే ఈ విషయాన్ని ప్రపంచానికి ప్రకటించడంలో నువ్వు తీసుకున్న సమయం విషయంలో నిన్ను చూసి గర్వపడుతున్నా.

ప్రెగ్నెన్సీ, పిల్లలు అనేది నీ వ్యక్తిగత విషయం’ అని మంచు ల‌క్ష్మీ పేర్కొంది. చాలా మంది సెల‌బ్రిటీస్ కూడా శ్రియ‌కి శుభాకాంక్షలు తెలియ‌జేశారు. ఈ మధ్యే భారత్‌కు తిరిగి వచ్చేసిన ఈ జంట ముంబైలో నివాసం ఉంటుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శ్రియ ప్రతిష్టాత్మక ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ఓ కీలకపాత్ర పోషిస్తుంది.