Mahesh : మహేష్ తో లేడీ స్టార్ డైరెక్టర్.. టార్గెట్ పెద్దదే..!

Mahesh : సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే దుబాయ్ లో ఫస్ట్ షెడ్యూల్ నెల రోజులు కంప్లీట్ చేసిన చిత్ర బృందం హైదరాబాద్‌లో ఉగాది రోజున మొదలు పెట్టారు. కొన్ని రోజులు షూటింగ్ జరిపిన సర్కారు వారి పాట చిత్ర బృందం యూనిట్ సభ్యులలో 5 మందికి కరోనా రావడంతో ప్రస్తుతానికి చిత్రీకరణ నిలిపివేశారు. ఇక ఈ సినిమాని జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

lady-star-director-with-mahesh
lady-star-director-with-mahesh

కాగా 2022 సంక్రాంతి పండుగ సందర్భంగా సర్కారు వారి పాట సినిమాని దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్ధిక కుంభకోణం నేపథ్యంలో దర్శకుడు పరశురాం తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు రెండు రకాల గెటప్స్‌లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే సర్కారు వారి పాట తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ ఒక పాన్ ఇండియన్ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా కారణంగా మహేష్ సినిమా కాస్త లేటయ్యేలా ఉందంటున్నారు.

Mahesh : మహేష్.. సుధా కొంగర దర్శకత్వంలో సినిమాకి సన్నాహాలు..!

దాంతో మహేష్ బాబు మరో సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాదిలోపే పూర్తి చేయాలని పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. కాగా తాజాగా మరో న్యూస్ వచ్చి వైరల్ అవుతోంది. గురు, ఆకాశం నీ హద్దురా సినిమాలతో స్టార్ డైరెక్టర్‌గా సౌత్‌లో పాపులారిటీ తెచ్చుకున్న లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో ఒక సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయట. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమో.. అధికారక ప్రకటన ఎప్పుడు రానుందో.

Advertisement