Laal Singh Chaddha Review : లాల్ సింగ్ చ‌ద్దా మూవీ రివ్యూ

NQ Staff - August 11, 2022 / 02:18 PM IST

Laal Singh Chaddha Review  : లాల్ సింగ్ చ‌ద్దా మూవీ రివ్యూ

Laal Singh Chaddha Review  : హాలీవుడ్‌లో ఎంతోమంది మనసులు దోచుకున్న సినిమా ‘ఫారెస్ట్ గంప్’. ఇక ఇప్పటికీ ఐఎమ్‌డీబీ రేటింగ్‌లో బెస్ట్ చిత్రాల్లో ఇది కూడా ఒకటి. ఈ సినిమాని అమీర్ ఖాన్ లాల్ సింగ్ చ‌ద్దా పేరుతో రీమేక్ చేశాడు. అమీర్ ఖాన్, కరీనా కపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో.. నాగచైతన్య ఓ కీ రోల్ చేశాడు. ఇది చైతూ బాలీవుడ్ ఎంట్రీ. ఇక అమీర్ ఖాన్ లాంటి స్టార్ సినిమాతో చైతూ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడంతో.. తనకు అక్కడ కూడా కెరీర్ మొదలయ్యిందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇక బాలరాజు పాత్రలో నాగచైతన్య లుక్ తన తాత అక్కినేని నాగేశ్వర రావును గుర్తుచేస్తోంది. చిత్ర క‌థ ఎలా ఉందో చూద్దాం.

Laal Singh Chaddha Review

Laal Singh Chaddha Review

క‌థ‌:

ఈ చిత్రం 1970ల కాలంలో లాల్ సింగ్ చద్దా (అమీర్ ఖాన్) బాల్యంతో ప్రారంభమవుతుంది. లాల్ సింగ్ చ‌ద్దా చిన్న‌ప్పుడు త‌క్క‌వు ఐక్యూతో పుడ‌తాడు. పుడతాడు, అతని వెన్నెముకలో సమస్య కారణంగా, అతను స‌పోర్ట్‌తో నడవవలసి ఉంటుంది. రూప అనే అమ్మాయి అతనితో స్నేహంగా కదులుతూ ప్రతి విషయంలోనూ అతన్ని ప్రోత్సహిస్తుంది. స్కూల్ మేట్స్ ఎగ‌తాళి చేయ‌డం వ‌ల‌న కూడా లాల్ సింగ్ లో క‌సి పెరుగుతుంది. భారత రాష్ట్రపతి నుండి గౌరవప్రదమైన పతకాన్ని అందుకుంటాడు . ఆ త‌ర్వాత లాల్ జీవితంలో ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంటాడు? వివిధ వ్యక్తులతో అత‌ని ప‌రిచ‌యం ఎలా సాగుతుంది అనేది చిత్రం చూస్తే తెలుస్తుంది.

Laal Singh Chaddha Review

Laal Singh Chaddha Review

న‌టీన‌టుల ప‌ర్‌ఫార్మెన్స్:

మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ లాల్ సింగ్ చ‌ద్దా పాత్ర‌లో జీవించాడు. వివిధ ధ‌ల‌లో ఆయ‌న ప‌ర్‌ఫార్మెన్స్‌తో పాటు మేకొవ‌ర్ కూడా చాలా బాగుంది. కొన్ని స‌న్నివేశాల‌లో పీకేను గుర్తుకు తెస్తాడు. నాగ చైతన్య అతిధి పాత్రలో డీసెంట్‌గా నటించినా, క్యారెక్టర్‌లో డెప్త్ లేకపోవడం వల్ల అభిమానుల‌కి నిరాశ క‌లుగుతుంది. లాల్ గర్ల్ ఫ్రెండ్ గా హీరోయిన్ కరీనా కపూర్ ఓకే. ప్రీ-క్లైమాక్స్ పోర్షన్స్ లో ఆమె యాక్టింగ్ బాగుంది. నటి మోనా సింగ్ తన తల్లి పాత్రలో పర్వాలేదు. సపోర్టింగ్ రోల్స్ చేసిన ఇతర ఆర్టిస్టులు తమ నటనతో మెప్పించారు.

టెక్నిక‌ల్ ప‌ర్‌ఫార్మెన్స్ :

ప్రీత‌మ్ సంగీతం సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రించింది. నేపథ్య సంగీతం సన్నివేశాలకు అవసరమైన భావోద్వేగాలను చేకూర్చింది. వార్ ఎపిసోడ్స్, అందమైన ల్యాండ్‌స్కేప్ షాట్‌ల కోసం సేతు సినిమాటోగ్రఫీని మెచ్చుకోవాలి. దర్శకుడు అద్వైత్ చందన్ ఫారెస్ట్ గంప్ స్ప్రెడ్ చేసిన మ్యాజిక్‌ని రీక్రియేట్ చేయడంలో విఫ‌లం అయ్యాడు. హేమంతి సర్కార్ ఎడిటింగ్ వర్క్ డల్ గా ఉంది. రెడ్ చిల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ చేసిన వీఎఫ్‌ఎక్స్ వర్క్ బాగుంది. స్టార్ హీరోలతో రూపొందిన ఈ చిత్రానికి నిర్మాణ విలువలు బాగున్నాయి.

Laal Singh Chaddha Review

Laal Singh Chaddha Review

ప్ల‌స్ పాయింట్స్:

అమీర్ ఖాన్ న‌ట‌న‌

మైన‌స్ పాయింట్స్:

సినిమా స్లోగా సాగ‌డం
ఎమోష‌న్స్ స‌రిగ్గా వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డం

విశ్లేష‌ణ‌:

1994లో విడుదలైన క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’కి రీమేక్ గా ఈ చిత్రం తెర‌కెక్కించ‌డంతో అంద‌రిలో అంచ‌నాలు బాగా పెరిగాయి. కాని అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేసింది ఈ చిత్రం. ఫ‌స్టాఫ్‌లో అమీర్ ఖాన్ పార్ట్ త‌ప్ప సినిమాలో పెద్ద‌గా మాట్లాడుకోవ‌డానికి ఏమి లేదు. ఆడియ‌న్స్‌ని పూర్తిగా నిరాశ‌ప‌రిచే చిత్రం ఇది.

                                                                              రేటింగ్: 1/5

Read Today's Latest సినిమా రివ్యూలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us