Khushboo: సీనియర్ హీరోయిన్ ఖుష్బూ ఎంత గా మారిపోయింది..!

Khushboo:సినిమా స్టార్స్ త‌మ పాత్ర‌ల‌కు అనుగుణంగా బాడీని మ‌ల‌చుకొని అంద‌రికి షాక్ ఇస్తున్నారు. ఒక‌సారి భారీగా పెరిగి, మ‌ళ్లీ స్లిమ్ లుక్‌లోకి మారుతుంటారు. ఈ కాలం నాటి అందాల భామ‌లు అయితే దాదాపు జీరో సైజ్ మెయింటైన్ చేస్తున్నారు. అయితే
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సౌత్ ని ఏలిన ముంబై భామ కుష్బూ ఒక‌ప్పుడు చాలా లావుగా ఉండగా, ఇప్పుడు స్లిమ్ లుక్ లోకి మారి ఆశ్చ‌ర్యం క‌లిగించింది.

Kushboo's Shocking Transformation
Kushboo’s Shocking Transformation

త‌మిళంలో అత్యధికంగా చిత్రాలు చేసిన కుష్బూ తెలుగు, కన్నడ, మలయాళ భాషలతో పాటు, హిందీలో కూడా చిత్రాలు చేశారు.వ‌య‌స్సు పెరిగాక కుష్బూ స‌పోర్టింగ్ పాత్ర‌లు పోషిస్తుంది. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ చిత్రాలలో కుష్బూ అమ్మ, అక్క పాత్రలు చేయడం జరిగింది. స్టాలిన్ మూవీలో చిరు అక్కగా నటించిన ఆమె, అజ్ఞాతవాసి మూవీలో పవన్ తల్లి పాత్ర చేశారు.

ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ హీరోగా రూపొందుతున్న ఆడ‌వాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలో న‌టిస్తుంది. సీనియర్ నటీమణులు రాధిక, ఊర్వశి కూడా న‌టిస్తున్నారు. అయితే కుష్బూ న‌టిగానే కాదు పొలిటీషియన్ గా కొనసాగుతున్నారు. మొదట డీఎంకే, అనంతరం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కుష్బూ… ఈ ఏడాది బీజేపీ పార్టీలో చేరారు.

ఇటీవ‌ల కుష్బూ ఓ టార్గెట్‌ పెట్టుకున్నారు. బరువు తగ్గాల‌న్న టార్గెట్ పెట్టుకున్న కుష్బూ అది చేసి చూపించింది. ‘‘బరువు తగ్గాలన్న లక్ష్యంతో చేసిన హార్డ్‌వర్క్‌కి తగ్గ ఫలితం కనబడుతోంది. ఫిట్‌గా ఉండాలనే ఈ హార్డ్‌వర్క్‌’ అన్నారు ఖుష్బూ. రీసెంట్‌గా మ‌రి కొన్ని ఫొటోలు షేర్ చేసింది కుష్బూ. యాభైఏళ్ల కుష్బూ 25ఏళ్ల అమ్మాయిలా క‌నిపిస్తుంది.