Kushboo: పెళ్లైన కుష్బూకి మ్యారేజ్ ప్ర‌పోజ‌ల్.. ఎంత వ‌ర‌కు వచ్చింద‌ని ట్వీట్

Kushboo: సోష‌ల్ మీడియా వ‌ల‌న సెల‌బ్రిటీల‌కు, అభిమానుల‌కి మ‌ధ్య దూరం చాలా త‌గ్గింది. ఒకరికొరు అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ వ‌స్తుండ‌గా, కొంద‌రు నెటిజ‌న్స్ అయితే ఏకంగా ప్ర‌పోజ‌ల్స్ చేస్తున్నారు.వారికి క‌థానాయిక‌లు అదిరిపోయే స‌మాధానాలు ఇస్తున్నారు.తాజాగా కుష్బూకి ఓ నెటిజ‌న్ పెళ్లి చేసుకుంటాన‌ని ప్రపోజ‌ల్ పెట్టాడు. దానికి కుష్బూ దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇచ్చింది.

Kushboo reacts on her marriage proposal comment
Kushboo reacts on her marriage proposal comment

అలనాటి నటి ఖుష్బూ ఐదుపదుల వయసులో కూడా గ్లామర్ గా కనిపిస్తుండడం చూస్తూనే ఉన్నాం. ఖుష్బూ అందానికి ఫిదా అయిన తమిళులు గుడి కూడా కట్టేశారు. అలాంటిది ఆమె క్రేజ్. విక్టరీ వెంకటేష్ డెబ్యూ మూవీ కలియుగ పాండవులు చిత్రంతో కుష్బూ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. తమిళంలో అత్యధికంగా చిత్రాలు చేసిన కుష్బూ తెలుగు, కన్నడ, మలయాళ భాషలతో పాటు, హిందీలో కూడా చిత్రాలు చేశారు.

న‌టిగా,పొలిటీషియ‌న్‌గా కుష్బూ స‌త్తా చాటుతున్నారు. రాజ‌కీయాల‌లోకి వ‌చ్చాక మొదట డీఎంకే, అనంతరం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కుష్బూ… ఈ ఏడాది బీజేపీ పార్టీలో చేరారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ తరపున పోటీ చేసిన పరాజయం పొందారు.

సినిమాల‌లో స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ చేస్తూ అల‌రిస్తున్న కుష్బూ.. ఈ మ‌ధ్య ఆడవాళ్లు మీకు జోహార్లు అనే చిత్రంలో న‌టించింది.శ‌ర్వానంద్ ఇందులో హీరో. మ‌రోవైపు ర‌జ‌నీకాంత్ అన్నాత్తె చిత్రంలోను న‌టించింది. ఈ సినిమా డ‌బ్బింగ్ రీసెంట్‌గా పూర్తి చేసింది.

ఇటీవ‌ల కుష్బూ చాలా స్లిమ్‌గా మారి కుర్ర హీరోయిన్ లా క‌నిపించింది. దీంతో ఆమెను తెగ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆమెకు ఈ సమయంలో రకరకాలుగా చిత్ర విచిత్రమైన కామెంట్స్ వస్తున్నాయి. ఖుష్బు షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ స్పందిస్తూ ఐ వాంట్ మారీ యూ ( మిమ్ములను పెళ్లి చేసుకోవాలని ఉంది) అంటూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ను ఫన్నీగా తీసుకున్న ఖుష్బు చాలా స్పోర్టివ్ గా స్పందించింది.

ఆ ట్వీట్ కు ఖష్బు రిప్లై ఇస్తూ.. ఓహ్.. నీవు లేట్ అయ్యావు. 21 ఏళ్ల క్రితం నువ్వు ఈ విషయాన్ని అడిగి ఉంటే బాగుండేది. అయినా కూడా నా భర్త తో మాట్లాడి చెప్తాను అంటూ స్మైల్ ఈమోజీలను షేర్ చేసింది. ఆమె ట్వీట్ కు మళ్లీ సదరు నెటిజన్ స్పందిస్తూ మేడం మీ భర్త నుండి ఏమైనా సమాధానం వచ్చిందా అంటూ ఫన్నీగా ప్రశ్నించాడు. మొత్తానికి వీరిద్దరి మద్య జరిగిన ఈ ట్వీట్స్ వైర‌ల్‌గా మారాయి.