KTR: కేటీఆర్ కుమారుడు హిమాన్షు సినిమాల‌లోకి రాబోతున్నాడా..!

సినీ సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కులు ఎక్కువ‌గా ప్ర‌జ‌ల దృష్టిని ఆకర్షిస్తుంటారు. వారి పిల్ల‌లు కూడా చాలా ఫేమ‌స్ అవుతున్నారు. సోష‌ల్ మీడియా ద్వారానో లేదంటే ప‌లు ఈవెంట్స్‌కు హాజ‌రైన స‌మ‌యంలోనో వీరి దృష్టి అంద‌రిపై ప‌డుతుంది. మ‌హేష్ బాబు, అల్లు అర్జున్ పిల్ల‌ల‌తో పాటు తెలంగాణ పితామహుడుగా పార్టీ కార్యకర్తల చేత కీర్తింపబడుతున్న సీఎం కేసీఆర్ మ‌న‌వ‌డు, కేటీఆర్ త‌న‌యుడు హిమాన్షు కూడా ఫుల్ ఫేమ‌స్ అయ్యాడు.

KTR son Himanshu
KTR son Himanshu

హిమాన్షు త‌ర‌చుగా త‌న తాతతో పాటు ప‌లు కార్యక్ర‌మాల‌కు హాజ‌రు కావ‌డం, ఇటీవ‌ల భ‌ద్రాచలంలో జ‌రిగిన సీతారాముల క‌ళ్యాణంలో పాల్గొన‌డంతో హిమాన్షు దృష్టి చాలా మందిపై ప‌డింది. చాలా మంది ఎం కేసీఆర్‌కు వారసుడిగా హిమాన్షు రాజకీయాల్లోకి రావడం ఖాయమని కార్యకర్తలు భావిస్తున్నారు. అయితే హిమాన్షు మాత్రం తన రాజకీయ భవిష్యత్‌పై తాజాగా క్లారీటి ఇచ్చాడు.

భ‌విష్యత్‌లో ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశాడు. తనకంటూ ప్రత్యేక లక్ష్యాలు ఉన్నాయని, వాటిని చేరుకోవడమే తన ధ్యేయమని తెలిపాడు. అయితే హిమాన్షుకి ప్ర‌త్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేప‌థ్యంలో కొంద‌రు ఆయ‌న‌ను సినిమాల‌లోకి రావాల‌ని కోరుతున్నారు. హిమాన్షు తండ్రి కేటీఆర్‌కి ఇండ‌స్ట్రీతో మంచి అనుబంధం నెల‌కొని ఉండ‌గా, ఆయ‌న త‌న‌యుడిని బ‌డా ద‌ర్శ‌క నిర్మాత‌లో పెట్టాల‌ని అనుకుంటున్నార‌ట‌.

వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మాణంలో హిమాన్షు హీరోగా ఓ సినిమా రూపొంద‌నుందనే వార్త ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అతి త్వ‌ర‌లోనే హిమాన్షు ఎంట్రీపై ప‌క్కా క్లారిటీ రానున్న‌ట్టు స‌మాచారం. ఈ వార్త నిజ‌మైతే టాలీవుడ్‌కి మ‌రో హీరో ప‌రిచ‌యం కానున్నాడ‌ని అర్ద‌మ‌వుతుంది.

కాగా, కేసీఆర్ కుటుంబంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న హిమాన్షు రావుపై ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేసిన పరిస్థితి నెలకొంది.. చాలా సంధర్బాల్లో సీఎం కేసిఆర్‌తో పాటు హిమాన్షు పేరును కూడా ప్రతిపక్ష పార్టీలు తెరమీదకు తెచ్చాయి. దీంతో హిమాన్షు మ‌రింత పాపుల‌ర్ అయ్యాడు.