KTR- Elon Musk: ఎలాన్‌ మస్క్‌ని ఆహ్వానించిన కేటీఆర్.. టెస్లాని తీసుకురావాలంటూ రిక్వెస్ట్

KTR- Elon Musk: బిలియనీర్ ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా తన పూర్తి యాజమాన్యంలోని షోరూమ్‌లను దేశంలో ప్రారంభించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ సింగిల్ బ్రాండ్ షోరూమ్‌లను తెరవడానికి నియమాలు , నిబంధనలకు సంబంధించి కంపెనీ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. ఒకవేళ కంపెనీ తన సింగిల్ బ్రాండ్ షోరూమ్‌ని దేశంలో ప్రారంభిస్తే, అది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు నిబంధనలకు లోబడి ఉండాలి.

KTR Invites ELon Mask to Setup Tesla in Hyderabad
KTR Invites ELon Mask to Setup Tesla in Hyderabad

భారత్‌లోకి టెస్లా కార్ల ప్రవేశంపై ఆ సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌ సోషల్‌ మీడియా వేదికగా చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వంతో ఎదురువుతోన్న సవాళ్ల కారణంగానే ఇండియాకు టెస్లా రాక ఆలస్యమవుతోందని మస్క్‌ ట్విట్టర్‌ లో ఆరోపించారు. అయితే భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలన్‌ చేసిన వ్యాఖ్యలపై చాలామంది మండిపడుతున్నారు. ఈక్రమంలో తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్‌ టెస్లా అధినేత వ్యాఖ్యలపై స్పందించారు.

భారత్ లో తమ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభిస్తున్నందుకు మస్క్‌కు ధన్యవాదాలు చెప్పిన ఆయన.. ఆ తర్వాత తెలంగాణ/ ఇండియాలో పరిశ్రమల అభివృద్ధికి బోలెడు అవకాశాలున్నాయన్నారు. ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, సుస్థిరత విషయాల్లో తెలంగాణ ఛాంపియన్‌గా నిలిచిందన్నారు. దేశంలో తమ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా ఉందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు కేటీఆర్‌.

అయితే ఇండియాలోకి టెస్లా కార్ల ప్రవేశంపై ఆ సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌ సోషల్‌ మీడియా వేదికగా చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వంతో ఎదురువుతోన్న సవాళ్ల కారణంగానే ఇండియాకు టెస్లా రాక ఆలస్యమవుతోందని మస్క్‌ ట్విట్టర్ లో ఆరోపించారు.

భారత్‌లో తమ కార్లను ప్రవేశపెట్టేందుకు టెస్లా అధినేత కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారు. మూడేళ్ల నుంచి ఈ విషయంపై భారత ప్రభుత్వం, మస్క్‌ మధ్య చర్చలు జరుగుతున్నా ఓ కొలిక్కి రావడం లేదు. ఇందుకు ఎలన్ విధించిన షరతులే కారణమని తెలుస్తోంది. మొదట విదేశాల్లో తయారుచేసిన కార్లను ఇండియాలో ప్రవేశపెడతామని, ఆతర్వాతే తయారీ యూనిట్‌ నెలకొల్పుతామని మస్క్ కండిషన్‌ పెట్టాడు.