KTR : చరిత్ర సృష్టించారు.. త్రిబుల్ ఆర్ మూవీ టీమ్ కు కేటీఆర్ ప్రశంసలు..!
NQ Staff - March 13, 2023 / 11:00 AM IST

KTR : ఆస్కార్ నామినేషన్స్ లో నాటు నాటు సాంగ్ హిస్టరీ క్రియేట్ చేసింది. అందరూ ఊహించనట్టు గానే ఆస్కార్ అవార్డు గెలిచి తెలుగు సినిమా సత్తా ఏంటో నిరూపించింది. ఆస్కార్ ఈవెంట్ లో ఎమ్ ఎమ్ కీరవాణి, చంద్రబోస్ ఈ అవార్డులు అందుకున్నారు. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు అవార్డు దక్కించుకుంది.
దాంతో దేశ వ్యాప్తంగా త్రిబుల్ ఆర్ మూవీ టీమ్ ను అంతా అభినందిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. నాటు నాటు సాంగ్ అవార్డు గెలుచుకునేలా కృషి చేసిన మూవీ టీమ్ కు కంగ్రాట్స్ తెలిపారు. అంతే కాకుండా ఇంత గొప్ప గౌరవాన్ని దక్కించుకున్న సందర్భంగా మూవీ టీమ్ కు టేక్ ఏ బౌ అంటూ తెలిపారు.

KTR Congratulates RRR Movie Team For Their Efforts Win Natu Natu Song Oscar Award
ఇదంతా జరగడానికి కారకులైన రాజమౌళికి స్పెషల్ విషెస్ తెలిపారు.

KTR Congratulates RRR Movie Team For Their Efforts Win Natu Natu Song Oscar Award
అంతే కాకుండా నా బ్రదర్స్ రామ్ చరణ్, తారక్ అద్భుతమైన డ్యాన్స్ తోనే ఇదంతా సాధ్యం అయిందంటూ తెలిపారు కేటీఆర్. ఆయన చేసిన ట్వీట్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
I join a Billion Indians in celebrating the Honour for #NaatuNaatu and #RRR ?
Kudos to @mmkeeravaani Garu and @boselyricist Garu on making History ❤️?
The man of the moment, brilliant storyteller who has made India proud @ssrajamouli Garu ?
Both my brothers, the superstars… https://t.co/TxKRZ8Dq1q pic.twitter.com/2IRfgPltYo
— KTR (@KTRBRS) March 13, 2023