Adipurush : ఆదిపురుష్ కోసం కృతి సనన్ ఏ రేంజ్‌లో కష్టపడుతుందో పాపం..!

Vedha - March 25, 2021 / 06:20 PM IST

Adipurush : ఆదిపురుష్ కోసం కృతి సనన్ ఏ రేంజ్‌లో కష్టపడుతుందో పాపం..!

Adipurush : కమర్షియల్ సినిమాలలో మన హీరో, హీరోయిన్స్ నటించడం పెద్ద ఇబ్బందేమి పడే విషయం కాదు. అయితే ప్రస్తుతం బయోపిక్స్ తో పాటు పౌరాణిక సినిమాలు రూపొందుతున్నాయి. ఇలాంటి సినిమాలలో నటించాలంటేనే కొన్ని అవస్థలు పడక తప్పదు. ప్రేక్షకులను మెప్పించాలంటే అనుకున్నంత ఈజీ కాదు. ప్రస్తుతం బయోపిక్స్, పౌరాణిక సినిమాలలో కొన్ని పాత్రలు పోషించాల్సి వచ్చినప్పుడు విమర్శలు వెల్లువెత్తుతుంటాయి కూడా. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాలంటే ముందు పోషించే పాత్రకి సంబంధించిన ప్రతీ విషయాన్ని రీ సెర్చ్ చేసి తెలుసుకోవాలి… నేర్చుకోవాలి. లేదంటే సినిమా చూశాక ప్రేక్షకులు కామెంట్స్‌తో చెలరేగిపోతారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి నెటిజన్స్ ట్రోల్స్ చేయడానికి కాచుకుని ఉంటారు. అందుకే ఇలాంటి సమస్యలుఎదురవకూడదనే బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ఆదిపురుష్‌‘ కోసం చాలా కష్టాలు పడుతుందట.

kruti-sanan-is-struggling-hard-for-adipurush

kruti-sanan-is-struggling-hard-for-adipurush

టాలీవుడ్ కి మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమా ద్వారా పరిచయం అయింది
కృతి సనన్. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా తనకి మంచి పేరే వచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్య తో దోచెయ్ సినిమా చేసింది. ఈ సినిమా ఫ్లాపవడంతో మళ్ళీ టాలీవుడ్ లో కనిపించలేదు.
అయితే ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా ‘ఆదిపురుష్‌’ 3డి సినిమాలో కృతి సనన్ సీత
పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ పాత్ర కోసం తెలుగు నేర్చుకోవడంతో పాటు సీత పాత్రకి సంబంధించిన హావా భావాలను ప్రాక్టీస్ చేస్తోందట. తెలుగు నేర్చుకునేందుకు ప్రత్యేకంగా
ఓ ట్యూటర్‌ను కూడా నియమించుకుందట. మరి ఇన్ని అవస్థలు పడి ఆది పురుష్ కోసం రెడీ అవుతున్న కృతి సనన్ ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. కాగా రావణుడి పాత్రను బాలీవుడ్
స్టార్ సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్ పోషిస్తున్నారు.

Adipurush : ఆదిపురుష్ సినిమాతో పాటు మరికొన్ని క్రేజీ మూవీస్ ని చేస్తోంది.

కాగా కృతి సనన్ బాలీవుడ్ లో ఆదిపురుష్ సినిమాతో పాటు మరికొన్ని క్రేజీ మూవీస్ ని చేస్తోంది. ఇప్పటికే మిమి అన్న సినిమా చేస్తుండగా షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే అక్షయ్ కుమార్ తో బచ్చన్ పాండే అన్న సినిమా చేస్తోంది. ఫర్హాద్ సాంజీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే రాజ్ కుమార్ రావ్ కి జంటగా హం దో హామే దో అన్న సినిమా కూడా పూర్తి చేసింది. ఈ సినిమా కూడా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటోంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us