Kriti Sanon: ఈ అమ్మ‌డి రేంజ్ ఇంత‌లా పెరిగింది..కోట్లు పెట్టి కారు కొన్న స‌న్న‌జాజి సోయ‌గం

Kriti Sanon: టాలీవుడ్‌లో ‘వన్‌.. నేనోక్కడినే’ తో సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు సరసన జతకట్టి తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన అందాల ముద్దుగుమ్మ కృతి స‌న‌న్‌. ఈ అమ్మ‌డికి తెలుగు సినిమాలు క‌లిసి రాక‌పోవ‌డంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్క‌డ వ‌రుస సినిమాలు చేస్తూ మంచి విజ‌యాలు సాధిస్తుంది.

Kriti Sanon gifts herself a swanky Mercedes Maybach GLS 600
Kriti Sanon gifts herself a swanky Mercedes Maybach GLS 600

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కృతి తాను మోడలింగ్‌ చేస్తున్నప్పటి విషయాలను పంచుకుంది. తన మొదటి ర్యాంప్‌ వ్యాక్‌ షోలో ఏదో పొరపాటు విషయమై కొరియోగ్రాఫర్‌ తన పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. ఆ షో ముగింపులో దాదాపు 20 మోడళ్ల ముందు ఆ కొరియోగ్రాఫర్‌ తనని తిట్టాడని చెప్పింది కృతి. ఆ తర్వాత తను ఆటోలో కూర్చుని ఆ విషయాన్ని తలుచుకుని ఏడవటం మొదలుపెట్టి.. అక్కడి నుంచి ఇంటికి వెళ్లి వాళ్ల అమ్మతో చెప్పి బాధపడినట్లు​ తెలిపింది.


ప్ర‌స్తుతం స్టార్ స్టేట‌స్ పొందిన కృతి స‌న‌న్‌.. ఇటీవ‌ల మిమి అనే చిత్రంతోను మంచి హిట్ కొట్టింది. ఇటీవలే ఈ నటి బచ్చన్ పాండే షూటింగ్ పూర్తి చేసింది. ఇందులో అక్షయ్ కుమార్‌ సరసన నటించింది. గణపత్‌లో టైగర్‌ ష్రాఫ్‌ సరసన నటిస్తుండగా, వరుణ్ ధావన్‌తో కలిసి నటిస్తున్న ‘భేదియా’ చిత్రం కోసం షూట్ కూడా చేసింది. ‘హమ్ దో హుమారే దో’ లో కూడా నటిస్తోంది. ప్ర‌భాస్ స‌ర‌సన ఆది పురుష్ అనే సినిమా కూడా చేస్తుంది.


తాజాగా ఈ అమ్మ‌డు తనకు తానే ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చుకుంది. మెర్సిడెస్- మేబాచ్ జీ ఎల్ ఎస్ 600 కారును కొనుగోలు చేయగా దాని ఖరీదు దాదాపు రూ. రెండు కోట్ల వరకు ఉంటుందని నెట్టింట్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారు ఫోటోలు తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోగా ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇక ఈ కారు ఫోటోని చూసిన నెటిజన్లు తెగ లైక్స్ చేస్తున్నారు.