Kriti Sanon : ప్రభాస్‌తో పెళ్ళి పుకార్లపై క్లారిటీ ఇచ్చేసిన కృతి సనన్.! ఏం చెప్పిందంటే.!

NQ Staff - November 30, 2022 / 10:03 AM IST

Kriti Sanon : ప్రభాస్‌తో పెళ్ళి పుకార్లపై క్లారిటీ ఇచ్చేసిన కృతి సనన్.! ఏం చెప్పిందంటే.!

Kriti Sanon : బాలీవుడ్ భామ కృతి సనన్ త్వరలో పెళ్ళి పీటలెక్కబోతోందట. అది కూడా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్‌తో కృతి సనన్ పెళ్ళి జరగబోతోందట. ఈ విషయమై ‘భేడియా’ హీరో వరుణ్ ధావన్ ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షో సందర్భంగా నర్మగర్భమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

కృతి సనన్ వేరే వ్యక్తి గుండెల్లో కొలువై వుందనీ, ఆ హీరో ప్రస్తుతం దీపికా పడుకొనేతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తున్నాడనీ, అతను ముంబైకి చెందినవాడు కాదనీ వరుణ్ ధావన్ చెప్పాడు.

తూచ్ అనేసిన కృతి సనన్

తాజాగా కృతి సనన్ సోషల్ మీడియా వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. పుకార్లనే గాలి బుడగను తాను పేల్చేస్తున్నాననీ, తన పెళ్ళి గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదనీ, నిరాధారమైన వార్తలకు విలువ లేదనీ కృతి సనన్ తేల్చేసింది.

అన్నట్టు, కృతి సనన్ ‘ఆదిపురుష్’ సినిమా కోసం ప్రభాస్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జంట చూడముచ్చటగా వుండడంతో కృష్ణంరాజు ఈ ఇద్దరికీ పెళ్ళి చేసేయ్యాలనుకున్నారంటూ గతంలో ప్రచారం జరిగింది. వరుణ్ ధావన్ వ్యాఖ్యలతో ఈ గాసిప్స్‌కి బలం చేకూరింది. కానీ, కృతి సనన్ తన పెళ్ళి ప్రచారం అంతా ఫేక్ అని స్పష్టం చేసేసింది.

Kriti Sanon clarified the marriage rumors with Prabhas

Kriti Sanon clarified the marriage rumors with Prabhas

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us