Krithi shetty: ఇంత షార్ట్ టైంలో అంత పెద్ద సాహ‌సం ఎందుకు కృతి ..!

Krithi shetty: కొంద‌రికి అదృష్టం భలేగా ప‌డుతుంది. షార్ట్ టైంలోనే వారు మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందుతారు. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడానికి నార్త్ అమ్మాయిలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ముంబైకి చెందిన కృతి శెట్టి కూడా టాలీవుడ్ సినిమా ఆఫ‌ర్ కోసం ఎంతో ఆశ‌గా ఎదురు చూసింది. ఆమెకు ఉప్పెన రూపంలో మంచి విజ‌యం ద‌క్కింది.

krithi_shetty gets more offers2
krithi_shetty gets more offers2

ఉప్పెన సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం అందంతోనే కాకుండా నటన పరంగా కూడా ఎంతగానో ఆకట్టుకుంది. తను నవ్వుతోనే కొంటె చూపుతో కట్టిపడేసింది అని చెప్పాలి. తప్పకుండా ఆమెకు చిత్ర పరిశ్రమలో మంచి కెరీర్ ఉందని కూడా చాలామంది అగ్ర దర్శకులు నిర్మాతలు కూడా ప్రశంసలు కురిపించారు. ఇక మొత్తానికి శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

నాని హీరోగా నటించిన ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సాయిపల్లవి నటించినప్పటికీ కృతి శెట్టి కూడా చాలా హైలెట్ గా నిలిచింది. ఎందుకంటే ఈ బ్యూటీ ఫస్టాఫ్ లోనే రొమాంటిక్ సీన్స్ తోనే డామినేట్ చేసింది. నాని తో చాలా ఘాటుగా లిప్ లాక్ సీన్లో నటించడంతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. ఒక విధంగా రొమాంటిక్ సీన్స్ చేయడానికి కూడా ఈ అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పకనే చెప్పేసింది.

పద్దెనిమిదేళ్ల వయసులో కృతి శెట్టి తీసుకుంటున్న నిర్ణయంతో అందరు షాక్ అవుతున్నారు. ఇక ఈ బ్యూటీకి కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం బంగార్రాజు సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. సుధీర్ బాబు తో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమా చేస్తోంది. ఇక రామ్ పోతినేని లింగుస్వామి ద్విభాషా చిత్రం, అలాగే నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలు కూడా మంచి స్క్రిప్ట్ తో తెరకెక్కుతున్నాయి.

krithi_shetty gets more offers2
krithi_shetty gets more offers2

తాజా స‌మాచారం ప్ర‌కారం కృతి శెట్టి ఉమెన్ సెంట్రిక్ చిత్రంలో న‌టించేందుకు సై అన్న‌ట్టు తెలుస్తుంది. చిరంజీవి కూతురు సుష్మిత నిర్మాణంలో ఈ చిత్రం రూపొంద‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, విరించి వ‌ర్మ తెర‌కెక్కించ‌నున్నాడ‌ట‌. గ‌తంలో ఈ ద‌ర్శ‌కుడు ఉయ్యాల జంపాల‌, మ‌జ్ను చిత్రాలు తెర‌కెక్కించాడు. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది.