Krithi Shetty : ట్రెడిష‌న‌ల్ లుక్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్ కేక పెట్టిస్తున్నాయిగా..!

Krithi Shetty : టాలీవుడ్‌కి ఉప్పెన‌లా దూసుకొచ్చిన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న ముద్దుగుమ్మ వ‌రుస ఆఫర్స్ అందుకుంటుంది. ఇటీవ‌ల‌… శ్యామ్ సింగ‌రాయ్ తో మెరిసింది. ఈ సంక్రాంతికి బంగార్రాజులోనూ సంద‌డి చేసింది ఈ ముద్దుగ‌మ్మ‌. సినిమాలో కృతి ప‌ర్‌ఫార్మెన్స్‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది.

Krithi Shetty traditional look
Krithi Shetty traditional look

ఇక ప్ర‌స్తుతం కృతి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలితో పాటుగా రామ్ తో ఓ సినిమా చేస్తోంది. ఇప్పుడు మెగా బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేయబోతున్న‌ట్టు టాక్‌. చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మాత‌గా మారిన సంగతి తెలిసిందే. త‌న బ్యాన‌ర్‌లో కొత్త కొత్త సినిమాలు రూపొంద‌నున్నాయి. ఉయ్యాల జంపాల‌తో ఆక‌ట్టుకున్న విరించి వ‌ర్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఇదో లేడీ ఓరియెంటెడ్ చిత్ర‌మని, క‌థానాయిక‌గా కృతిని ఎంచుకున్నార‌ని స‌మాచారం.

Krithi Shetty traditional look
Krithi Shetty traditional look

కృతి శ‌ట్టి ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ, ఫొటోషూట్స్ తో అల‌రిస్తుంది. అందుకు కొత్త కొత్త ఫొటో లుక్ తో ఇస్టాలో కనిపిస్తోంది. తన అందంతో నాజూకు చూపులతో అందరి మనసులను దోచుకుంటోంది. అందం మన సొంతమైతే ఏ రంగు దుస్తువైన ఒంటిపై మెరిసిపోతుంది. అలాగే టాలీవుడ్ సుందరాంగి కృతి శెట్టి హాఫ్ శారీలో మెరిసిపోయింది.

Krithi Shetty traditional look
Krithi Shetty traditional look

కృతి శెట్టి క్యూట్ పిక్స్‌కి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు. రంగుల ప్రపంచంలో మెప్పించుకోవాలంటే అందం, అభినయంతో పాటు కొంత దూసుకుపోయే గుణం ఉండాలి. ఈ మూడు ఉంటే చాలు ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చు. సమంత, రష్మిక లాంటి హీరోయిన్స్ ఈ కోవకే చెందుతారు. తాజాగా ఈ లిస్ట్ లో చోటు సంపాదించుకుంది ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి. పాతికేళ్లు కూడా నిండకుండానే కృతి టాలీవుడ్ ని ఊపేస్తుంది. తన నటనా శైలితో ప్రేక్షకులను అలరిస్తోంది.