Krithi Shetty: స‌మంత భ‌ర్త‌కు నో చెప్పిన ఉప్పెన బ్యూటీ.. ఇదేం సిత్రం!

Krithi Shetty: ఉప్పెన సినిమాతో అంద‌రి దృష్టి ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. తొలి సినిమాలోనే ఈ అమ్మడు న‌ట విశ్వరూపం చూపించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. పెద్దగా అందాల ఆర‌బోత చేయ‌కుంగా కేవ‌లం త‌న న‌ట‌న‌తోనే ఆకట్టుకొని తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులని గెలుచుకుంది. ఇప్పుడు ఈ అమ్మ‌డిపై టాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌ల దృష్టి ఉంది.

Krithi Shetty Say No to naga Chaithanya
Krithi Shetty Say No to naga Chaithanya

కృతి శెట్టి పర్ఫార్మెన్స్‌ చూసి నాగార్జున ఫిదా అయ్యార‌ని ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చారనే న్యూస్ కొద్ది రోజులుగా వైరల్ అవుతోంది. అక్కినేని నాగార్జున- కళ్యాణ్ కృష్ణ కురసాల కాంబోలో గతంలో వచ్చిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘సోగ్గాడే చిన్నినాయనా’ సీక్వల్‌గా రాబోతున్న ‘బంగార్రాజు మూవీ రూపొందుతుండ‌గా, ఈ మూవీని త్వ‌ర‌లోనే సెట్స్ పైకి తీసుకురానున్నారు.

బంగార్రాజు చిత్రంలో నాగ చైత‌న్య కూడా కీల‌క పాత్ర పోషిస్తున్నారు. చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటించనుండగా.. నాగ చైతన్య జంటగా కృతి శెట్టి నటించనుందని అంటున్నారు. ఇప్పటికే ఈ రోల్ కోసం కొందరు హీరోయిన్లను పరిశీలించిన టీమ్.. నాగార్జున సూచన మేరకు కృతి శెట్టి వైపు మొగ్గు చూపిన‌ట్టు స‌మాచారం. అయితే ఈ ఆఫ‌ర్‌ని కృతి సున్నితంగా తిర‌స్క‌రించింద‌ట‌.

కృతి శెట్టి ప్ర‌స్తుతం శ్యామ్ సింగరాయ్ సినిమాతో పాటు లింగు స్వామి-రామ్ పోతినేని సినిమా, సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ ‘అమ్మాయి గురించి చెప్పాలని ఉంది’ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. ఈ మూడు సినిమాల‌తో చాలా బిజీగా ఉన్న నేప‌థ్యంలో కృతి శెట్టి .. బంగార్రాజు సినిమాకి నో చెప్పిన‌ట్టు ఫిలిం న‌గ‌ర్‌లో చ‌ర్చ న‌డుస్తుంది. ఇదిలా ఉంటే యంగ్ హీరో నితిన్ సరసన మరో సినిమాలో ఆమెను ఫైనల్ చేశారని తెలుస్తోంది.

షార్ట్ టైంలో కృతి శెట్టికి ఆఫ‌ర్స్ వెల్లువ‌లా వ‌స్తుండ‌డం ప‌ట్ల ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. చూస్తుంటే రానున్న రోజుల‌లో కృతి శెట్టి స్టార్ హీరోయిన్‌గా మారిన ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం తెలుగు సినిమాల‌కే ప‌రిమిత‌మైన కృతి త‌మిళం, హిందీ భాష‌ల‌కు సంబంధించిన స్క్రిప్ట్స్ కూడా వింటుంద‌ట‌.