Krithi Shetty: కృతి ముద్దు పేరేంటో తెలుసా.. బోర్న్ స్టార్ అంటూ ఆమెపై ప్ర‌శంసలు కురిపించిన హీరో ఎవ‌రు?

Krithi Shetty: కృతి శెట్టి.. ఈపేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఉప్పెన సినిమాతో అంద‌రి మ‌తులు పోగొట్టిన ఈ ముద్దుగుమ్మ బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో ఆడియెన్స్ ని అలరించేందుకు రాబోతుంది. అందులో భాగంగా `శ్యామ్‌ సింగరాయ్‌` చిత్రంతో కనువిందు చేసింది. ఇప్పుడు సంక్రాంతికి బంగార్రాజు చిత్రంతో ప‌ల‌క‌రించ‌బోతుంది. ఇందులో పల్లెటూరి అమ్మాయిగా కనువిందు చేయబోతుంది కృతి శెట్టి.

Krithi Shetty Nick Name Do you Know
Krithi Shetty Nick Name Do you Know

చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా కృతి శెట్టి, ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ‌.. అలీతో స‌ర‌దాగా కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఈ షోలో కృతితో ఆలీ చేసిన సంద‌డి మంచి వినోదం పంచింది. కృతి ముద్దు పేరు `బుంగి` అని చెప్పాడు. దీంతో షాకైనా కృతి మీకెలా తెలుసు అని అడగ్గా, మరో పేరు కూడా ఉందన్నాడు. కాకపోతే దాన్ని మాత్రం అర్థమై కానట్టుగా చెప్పడం విశేషం. ఆక ఆమెకు మేం పెట్టిన పేరు `కే.కే` అని తెలిపారు. `కృతి కృష్ణ` అని తనే చెప్పేసింది కృతి.

మరోవైపు అలీ..కృతిని ఓ షాకింగ్‌ ప్రశ్న అడిగారు. ఇంత అందంగా పుట్టేందుకు మీ ఊర్లో ఏమైనా అమ్ముతారా? అని అడగ్గా, `అవును నీళ్లలో ఏదో మిక్సయ్యింది` అని కృతి చెప్పడం నవ్వులు పూయించింది. సినిమాల్లోకి రాకముందు పలు కంపెనీలకు ప్రకటల్లో నటించారటగా అని అడగ్గా, తాను 25 ప్రొడక్ట్ ల యాడ్స్ లో నటించానని తెలిపింది. అయితే మొదటగా తాను బిస్కేట్‌ యాడ్స్ లో చేశానని చెప్పడంతో పక్కనున్న దర్శకుడు నవ్వులు పూయించారు. చాక్లెట్‌, బిస్కేట్స్ అంటూ ఆటపట్టించాడు.

Krithi Shetty Nick Name Do you Know
Krithi Shetty Nick Name Do you Know

ఇక ఎవరికైనా వేశారా బిస్కెట్‌ అని అలీ ప్రశ్నించారు. దీంతో లేదు లేదు అంటూ కృతి ఇచ్చిన రియాక్షన్‌ ఆకట్టుకుంటుంది. మీకు ఎవరైనా వేశారా బిస్కెట్‌ అని అడగ్గా, లేదని సమాధానం చెప్పింది కృతి. దీంట్లో కళ్యాణ్‌ కృష్ణ కల్పించుకుని రెగ్యూలర్‌గా జరుగుతూనే ఉంటాయని చెప్పగా, పక్కనుండి క్రీమ్‌ బిస్కెట్‌ అనే శబ్దం రావడం మరింతగా నవ్వులు పూయించింది.

ఆ తర్వాత `ఉప్పెన` హిట్‌ అయిన తర్వాత టాలీవుడ్‌లో ఓ పెద్ద హీరో బోకేతోపాటు పెద్ద గిఫ్ట్ కూడా పంపించారట. ఎవరాయనా? అని ప్రశ్నించాడు అలీ. అందుకు కృతి రియాక్ట్ అవుతూ పేరు చెప్పేందుకు తడబడినట్టుగా కనిపించింది. ఆయన బోర్న్ స్టార్‌ అని చాలా మంచి మాటలు రాశారని తెలిపింది కృతి. ఆయన పక్కన హీరోయిన్‌ గా ఛాన్స్ వస్తే చేస్తావా? అని అడగ్గా, అంటే కాస్త కంగారు ప‌డింది.

Krithi Shetty Nick Name Do you Know
Krithi Shetty Nick Name Do you Know

బ్రహ్మానందం అంటే ఇష్టమని చెప్పిన కృతి.. ఆయనలా యాక్ట్ చేసి చూపించింది. మరోవైపు ఏ హీరోతో యాక్ట్ చేయాలనే డ్రీమ్‌ ఉందనే ప్రశ్నకి.. ఆమె సమాధానం చెప్పలేదు. మధ్యలో దర్శకుడు కల్పించుకుని ఇప్పుడు స్మార్ట్ ఆన్సర్‌ బయటకు వస్తుందని చెప్పడం నవ్వులు పూయించాయి. `ఉప్పెన`లో బేబమ్మవెంట హీరో పడ్డట్టు రియల్ లైఫ్‌లో ఎవరైనా పడ్డారా ? అని ప్రశ్నించగా, లేదంటూ సమాధానం చెప్పింది. పడకుండా ఎవరుంటారు అని దర్శకుడు చెప్పారు. ఈ ఎపిసోడ్ ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.