Krithi Shetty: బ్లూ క‌ల‌ర్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న ఉప్పెన బ్యూటీ

Krithi Shetty: యంగ్ బ్యూటీ కృతి శెట్టి తొలి సినిమా ఉప్పెన‌తోనే అంద‌రి మ‌న‌సులు గెలుచుకుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతూ.. తెరకెక్కిన ఉప్పెన‌ సినిమా ప్రేక్షకులను అలరించడమే కాదు.. కలెక్షన్ల పరంగా కూడా నిర్మాతలు మంచి రాబడిని అందించింది. ఈ సినిమాలో తన నటనతో ఫిదా చేసిన కృతి శెట్టికి ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

TheNewsQube-
Krithi Shetty Latest Stills in Blue Dress
Krithi Shetty Latest Stills in Blue Dress

ఉప్పెన సినిమా త‌ర్వాత కృతి రేంజ్ మారిపోయింది. వ‌రుస సినిమా ఆఫ‌ర్స్ త‌లుపు తడుతున్నాయి. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న శ్యామ్ సింగరాయ్ చిత్రంలో కృతి ఆఫ‌ర్ అందుకుంది. న్యాచురల్ స్టార్ నాని ఇందులో హీరో.. కృతితో పాటు ఈ సినిమాలో సాయి పల్లవి, మడోనా సెబాస్టియన్లు కూడా హీరోయిన్లుగా చేస్తున్నారు.

Krithi Shetty Latest Stills in Blue Dress
Krithi Shetty Latest Stills in Blue Dress

ఇక కృతి నటిస్తున్న మరో చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఈ సినిమాలో సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్నారు. మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. తమిళ దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్‌లో ‘RAPO19’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.

2003, సెప్టెంబరు 21న కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో జన్మించింది కృతి శెట్టి. చిన్నప్పటినుంచే పలు యాడ్స్‌తో తన ప్రత్యేకతను చాటుకుంది కృతి. హిందీలో 2019లో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన ‘సూపర్ 30’ సినిమాలో విద్యార్థిగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

Krithi Shetty Latest Stills in Blue Dress
Krithi Shetty Latest Stills in Blue Dress

ఈ మూవీలోని ‘ఈశ్వరా.. పరమేశ్వరా’ పాటకు శివరాత్రి సందర్భంగా స్పెషల్‌ ప‌ర్‌ఫార్మెన్స్ ఇచ్చి ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేసింది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే కృతి శెట్టి అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తుంది. తాజాగా బ్లూ క‌ల‌ర్ డ్రెస్‌లో రెచ్చిపోయి అందాలు ఆర‌బోస్తుంది. ప్ర‌స్తుతం కృతి పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.