KRITHI SHETTY: బేబమ్మకు చిన్ని కోరిక.. నెరవేర్చే దర్శకుడు ఎక్కడున్నాడు..?

ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోవడం ఎలా..? ఈ ప్రశ్నకు సమాధానం ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టిని చూపిస్తే సరిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఒక్క సినిమా కాదు.. ఆ ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే క్రేజ్ తెచ్చుకుంది కృతి. కేవలం ఉప్పెన పోస్టర్స్, పాటలు చూసి ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో కృతి శెట్టి ఫ్యాన్ పేజెస్ కూడా పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం చేతినిండా అవకాశాలతో ఫుల్ బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగ రాయ్, సుధీర్ బాబు ఇంద్రగంటి కాంబినేషన్లో వస్తున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాల్లో నటిస్తోంది ఈ కన్నడ కస్తూరి.

Krithi Shetty Beautiful Clicks
Krithi Shetty Beautiful Clicks

ఈ రెండు సినిమాలకు దాదాపు 40 లక్షల వరకు పారితోషికం అందుకుంటుంది. ఇకపై కమిట్ అయ్యే సినిమాలకు దాదాపు 80 లక్షల నుంచి కోటి రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా అభిమానులతో కాసేపు ముచ్చటించి తన మనసులో మాటలు పంచుకుంది కృతి శెట్టి. తెలుగు ఇండస్ట్రీ తనకు చాలా బాగా నచ్చిందని.. ఒక్క సినిమాతోనే ఇక్కడ ప్రేక్షకులు తనపై చూపించిన అభిమానం చూసి పొంగిపోతున్నాను అంటూ గాల్లో తేలిపోయింది ఉప్పెన హీరోయిన్. ఇదిలా ఉంటే తనకు ఒక చిన్న కోరిక మిగిలిపోయిందని.. అది ఏ దర్శకుడు నెరవేరుస్తాడా అని వేచి చూస్తున్నట్లు చెప్పుకొచ్చింది కృతి శెట్టి.

అదేంటో తెలుసా.. చాలా సింపుల్ సొంత డబ్బింగ్ చెప్పుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది హీరోయిన్లు సొంత డబ్బింగ్ చెప్పుకోవడానికి ఆలోచిస్తున్నారు. కానీ కొందరు మాత్రం ధైర్యంగా చెబుతున్నారు. కీర్తి సురేష్, సాయి పల్లవి లాంటి వాళ్ళు తెలుగు స్పష్టంగా రాకపోయినా నేర్చుకొని మరీ డబ్బింగ్ చెబుతున్నారు. ఇప్పుడు కృతి శెట్టి కూడా అదే చేస్తాను అంటుంది. తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని ఉందని.. ఫ్యూచర్ లో తప్పకుండా చేసి చూపిస్తాను అంటుంది. ఈ ముద్దుగుమ్మ చిలక పలుకులు వినడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ అవకాశం ఇచ్చే దర్శకుడు ఎవరో చూడాలి.

Advertisement