Krithi shetty : కృతి శెట్టికి మెగాహీరో సినిమాలో ఛాన్స్..?

Krithi shetty : కృతి శెట్టి ..ఉప్పెన సినిమాతో వచ్చి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాకి ముందు ఒక్క ఛాన్స్ అంటూ మేకర్స్‌ని రిక్వెస్ట్ చేసిందట. కానీ ఇప్పుడు మా ఒక్క సినిమా ఒప్పుకోండి అని మేకర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. అంటే కృతి రేంజ్ ఒక్క సినిమాతో ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉప్పెన తర్వాత ఈ యంగ్ బ్యూటీ క్రేజ్ అమాంతం ఆకాశంలో నిలిచింది. వరుసగా టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది.

krithi-shetty got chance in mega hero movie
krithi-shetty got chance in mega hero movie

నాని నటిస్తున్న శ్యాం సింగ రాయ్ సినిమాలో ఒక హీరోయిన్‌గా నటిస్తోంది. సాయి పల్లవి ఉన్నా కూడా కృతి మీద బాగానే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అలాగే సుధీర్ బాబు తో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలని ఉంది.. అనే సినిమా చేస్తోంది. డిఫ్రెంట్ జోనర్‌లో తెరకెక్కే ఇందులో కృతి శెట్టి పాత్ర చాలా హైలెట్ గా నిలుస్తుందట. ఇక ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని – లింగు స్వామి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో కూడా కృతి శెట్టి హీరోయిన్.

Krithi shetty : కృతి శెట్టిని తీసుకోవాలని మేకర్స్ సంప్రదించారట.

ఈ మూడు అఫీషియల్ గా ప్రకటించారు. మూడు సినిమాల షూటింగ్ కూడా ప్రారంభమయింది. ఇవి కాకుండా తాజాగా సాయి ధరం తేజ్ సరసన నటించే అవకాశం అందుకుందట ఈ యంగ్ బ్యూటీ. కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు సాయి తేజ్. సుకుమార్ దర్శకత్వ శాఖలో పని చేసిన ఈ యంగ్ డైరెక్టర్ దీనితో దర్శకుడిగా మారుతున్నాడు. ఈ ప్రాజెక్ట్ కి కృతి శెట్టిని తీసుకోవాలని మేకర్స్ సంప్రదించారట. కృతి ఎంట్రీ ఇచ్చిందే మెగా హీరోతో కాబట్టి నో అనలేదట. కథ కూడా నచ్చడంతో ఒకే చెప్పిందట. అఫీషియల్ న్యూస్ ఎప్పుడు వస్తుందో చూడాలి.