Krithi Shetty : బెడ్‌పై అలా కూర్చొని క్యూట్ ఫోజులు ఇచ్చిన కృతి శెట్టి

Krithi Shetty : ఉప్పెన సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. కన్న‌డ నుండి వ‌చ్చిన ఈ ముద్దుగుమ్మ‌కు తెలుగు ప్రేక్ష‌కులు ప‌ట్టం క‌ట్టారు. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఆమెకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కొత్త సినిమా తీయాలని దర్శన నిర్మాతలకు ఆలోచన వస్తే మొదట హీరోయిన్ గా ఆమె పేరే వినిపిస్తోందని టాక్.. కన్నడ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు పట్టం కడుతున్నారు.

Krithi Shetty cute photo shoot
Krithi Shetty cute photo shoot

ఉప్పెన రిలీజ్ అయితే అమ్మాయి డేట్స్ దొరకవు అంటూ చిరంజీవి ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పిన మాటలు అక్షరాలా నిజం అవుతున్నాయి. నిజంగానే ఈ భామ డేట్స్ ఇప్పుడు బంగారం అయిపోతున్నాయి. అంతేకాదు రెండో సినిమాకే దాదాపు 75 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Krithi Shetty cute photo shoot
Krithi Shetty cute photo shoot

ఉప్పెన సినిమాలో నటించే కంటే ముందే ఈమె యాడ్స్‌లోనూ నటించింది. వాటికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. అక్కినేని నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో ప్రస్తుతం సెట్స్ మీదున్న చిత్రం ‘బంగార్రాజు’. ‘సోగ్గాడే చిన్నినాయన’ సూపర్ హిట్ మూవీకిది సీక్వెల్ . కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో చైతూ స‌ర‌స‌న న‌టిస్తుంది కృతి.

Krithi Shetty cute photo shoot
Krithi Shetty cute photo shoot

ఇప్పటికే ఉప్పెన సినిమాతో తెలుగలో క్రేజీ బ్యూటీగా మారిన ఈమె వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. అంతేకాదు ఈ భామ త్వరలో ఓ బాలీవుడ్ క్రేజీ హీరో ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చినట్టు బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. తొలి సినిమా విడుదల కాకముందే ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. అందులో భాగంగా నాచురల్ స్టార్ నాని సరసన ’శ్యామ్ సింగరాయ్’ లో ఓ కథానాయికగా నటించే ఛాన్స్ కొట్టేసింది.

Krithi Shetty cute photo shoot
Krithi Shetty cute photo shoot

రామ్ సినిమా, సుధీర్ సినిమాల‌లోను న‌టిస్తున్న కృతి శెట్టి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలోను యాక్టివ్‌గా ఉంటుంది. ఈ అమ్మ‌డు బెడ్ పై కూర్చొని తాజాగా ఫొటోల‌కు ఫోజులిచ్చింది. ఈ పిక్స్ వైర‌ల్‌గా మారాయి.