Krithi Shetty: కృతిశెట్టి బర్త్ డే స్పెషల్.. తన పర్సనల్ విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్న బేబమ్మ

Krithi Shetty: టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది కృతి శెట్టి. ఫస్ట్ సినిమాతోనే క్రేజీ ఫేమ్ తో పాటు.. క్రేజీ ఆఫర్స్ ని కూడా సొంతం చేసుకుంది. కృతిశెట్టి అని పిలిచే కంటే బేబమ్మ అంటేనే ఎక్కువమంది గుర్తుపడతారు. సెప్టెంబర్ 21 న బేబమ్మ పుట్టినరోజు సందర్భంగా ఆమె సోషల్ మీడియా అకౌంట్ లో నెటిజన్స్ తో లైవ్ లోకి వచ్చి ఓ క్యూట్ వీడియోని షేర్ చేసుకున్నారు.

ఇక ఆమె పర్సనల్ విషయాల్ని షేర్ చేసుకున్నారు. కృతి శెట్టికి గ్రీన్ టీ ఫేవరెట్, అలాగే పింక్ అండ్ బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టమట. కృతికి ఫేవరెట్ డిష్ చికెన్ అట. తన బర్త్ డే కి చిల్డ్రన్ హోమ్ కి తన ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తానని, వాళ్ళతో మాట్లాడి గిఫ్ట్స్ షేర్ చేస్తానని అన్నారు. అలాగే తనను అభిమానించే ప్రేక్షకులంటే తనకు ఎంతో ప్రేమని, అంతకన్నా రెస్పెక్ట్ ఉందని అన్నారు.

అలాగే ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ నుండి ఈ స్థాయికి చేరుకోవడానికి కూడా కారణం ఆడియన్స్ అని థ్యాంక్స్ చెప్పింది. అలాగే తెలుగులో ఇప్పుడు ఎక్కువ ఆఫర్స్ రావడానికి కూడా తెలుగు ప్రేక్షకుల సపోర్ట్ వల్లేనని తనను ఇలాగే ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో ఉండేలా బ్లెస్ చేయాలని అన్నారు.

తన ఫ్యాన్స్ ని తాను ఎంతగానో ప్రేమిస్తున్నానని బేబమ్మ చెప్పింది. ఈ వీడియోలో ఇంకా తన పర్సనల్ విశేషాలను చెప్తానని కూడా అన్నారు. అలాగే తన అందమైన జుట్టుకు కొబ్బరి నూనె వాడతానని.. ఇంకెలాంటి టిప్స్ అవసరం లేదని అన్నారు.

అలాగే తనకు బోర్ కొట్టినప్పుడు, చిల్ అవ్వడానికి చక్కగా మ్యూజిక్ పెట్టుకుని డాన్స్ చేస్తానని అంటుంది ఈ బ్యూటీ. ఉప్పెన సినిమా తర్వాత కృతి శెట్టి నాని సరసన శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత రామ్ కి జోడిగా మరో సినిమాలో నటిస్తున్నారు.