Krithi Shetty: బేబ‌మ్మ బ‌ర్త్ డే వేడుక‌ల‌ని సెట్‌లో గ్రాండ్‌గా జ‌రిపిన చిత్ర యూనిట్

Krithi Shetty: ఉప్పెన సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన కృతి శెట్టి ఇప్పుడు వ‌రుస సినిమాలు చేస్తూ మిగతా హీరోయిన్స్‌కి అసూయ పుట్టిస్తుంది. తొలి సినిమానే సూపర్‌, డూపర్‌ హిట్‌ అవ్వడంతో ఈ ‘బేబమ్మ’కు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే నాని శ్యామ్‌ సింగరాయ్‌, సుధీర్‌ బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’,నితిన్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలతో పాటు లింగుస్వామి, రామ్‌ పోతినేని కాంబోలో రాబోతున్న చిత్రంలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది.

Krithi Shetty

నాగార్జున బంగార్రాజు చిత్రంలోను చైత‌న్య‌కు జోడీగా న‌టిస్తుంది.ఈ రోజు కృతిశెట్టి బ‌ర్త్ డే కావ‌డంతో ఆమె న‌టిస్తున్న సినిమాల నుండి వ‌రుస పోస్ట‌ర్స్ విడుద‌ల చేసి ఫ్యాన్స్‌కి ఆనందాన్ని క‌లిగించారు. సుధీర్ బాబు- ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఈ సినిమా టీమ్ కూడా కృతికి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఓ పోస్టర్‌ని విడుదల చేసింది.

Krithi Shetty

రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుధీర్‌ ప్రేమించిన అమ్మాయిగా న‌టిస్తోంది కృతి శెట్టి . అయితే ఈ మూవీ సెట్‌లో కృతి శెట్టి బ‌ర్త్ డే వేడుక‌లు జ‌ర‌ప‌గా ఇందుకు సంబంధించిన ఫొటోలు వైర‌ల్‌గా మారాయి. చిత్ర బృందం స‌మ‌క్షంలో కృతి త‌న బ‌ర్త్ డేని గ్రాండ్‌గా జ‌రుపుకొని సంతోషిస్తుంది.

Krithi Shetty

ఇక రామ్‌ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ద్విభాషా చిత్రంగా తెలుగు మరియు తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. నేడు కృతి బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి కృతిశెట్టి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.