Krithi shetty: గ్లామ‌ర్ డోస్ పెంచుతున్న కృతి.. ఇక రానున్న రోజుల‌లో ప్రేక్ష‌కుల‌కి ఫుల్ మ‌జా..!

Krithi shetty: ఉప్పెన సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. శెట్టి… తొలి సినిమా రిలీజ్ అవ్వకముందే సెన్సేషన్ క్రియేట్ చేసిన బ్యూటీ చాలామందికి కలల రాకుమారిగా మారిపోయింది. సౌత్‌లో చాలామంది దర్శకనిర్మాతలు ఇప్పుడు ఈ బ్యూటీ డేట్స్ కోసం ఆరాటపడుతున్నారు. అయితే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇక్కడికి పరిస్థితులకు అలవాటు పడిపోవాల్సిందే.

 

krithi shetty beautiful look.jpg
krithi shetty beautiful look.jpg

స్కిన్ షో కానీ, హాట్ రొమాన్స్ సీన్స్, లిప్ లాక్‌లకు ఆమడ దూరం ఉంటానని తొలుత సంకేతాలిచ్చిన ఈ సుందరాంగి.. రెండో సినిమాకే హద్దులు చెరిపేసింది. ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా టీజర్‌ చివర్లో.. హీరో నానికి లిప్ లాక్ ఇస్తూ కనిపించింది ఈ బ్యూటీ. టీజర్ ఎండింగ్ వరకు ఎక్కడా కనిపించని కృతి శెట్టి.. చివర్లో మాత్రం నానికి లిప్ లాక్ ఇవ్వడంతో ఆమె ఫ్యాన్స్ కంగుతిన్నారు.

krithi shetty beautiful look1.jpg
krithi shetty beautiful look1.jpg

టీజర్‌ మొత్తంలో కృతి శెట్టి ఎక్కడ కనపడలేదు కానీ.. చివర్లో నానికి లిప్‌లాక్‌ సీన్‌లో మాత్రమే కనిపించింది. దీంతో ఆమె ఫ్యాన్స్ కొంద‌రు హ‌ర్ట్ అయ్యారు. ఇక ఇన్నాళ్లు సోష‌ల్ మీడియాలో చాలా ప‌ద్ద‌తిగా దిగిన ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి తాజాగా హాట్ హాట్ లుక్స్ షేర్ చేసింది. ఈ పిక్స్ చూసిన అభిమానులు రానున్న రోజుల‌లో ర‌చ్చ ఖాయం అని డిసైడ్ అయ్యారు.

 

కృతి శెట్టి ప్రస్తుతం ‘శ్యామ్ సింగ రాయ్’తో పాటు, బంగార్రాజు మూవీలో నాగ చైతన్యతో సరసన నటిస్తోంది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్‌లో మరో సినిమా కమిటైనట్లు తెలుస్తోంది. కాగా సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది ఈ బ్యూటీ. కాగా ‘శ్యామ్ సింగ రాయ్’ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా ఉంది.