Krithi Shetty: లాంగ్ ఫ్రాక్‌లో క్యూట్ లుక్స్‌తో క‌నిపించిన బేబ‌మ్మ‌.. ఆకర్షిస్తున్న అందం

Krithi Shetty: తొలి సినిమాతోనే మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన యంగ్ సెన్సేష‌న్ కృతి శెట్టి. ఈ మంగుళూరు బ్యూటీ సుకుమార్ శిష్యుడు బుచ్చుబాబు సన దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది .మొదటి సినిమాతోనే భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకొన్న ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్న సంగతి తెలిసిందే.

TheNewsQube-
Krithi Shertty Latest Photoshoot Pics
Krithi Shertty Latest Photoshoot Pics

తెలుగులో స్పష్టంగా, చాలా చక్కగా మాట్లాడేస్తూ.. టాలీవుడ్‌లో ఇంత తక్కువ కాలంలో ఇంత ఫాలోయింగ్‌ సాధించిన ఘనతను కొట్టేసింది కృతి. నాని జోడీగా కృతి శెట్టి నటిస్తున్న ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలో కృతి క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, ఈ సినిమావిభిన్నమైన కథాకథనాలతో రూపొందింది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించాడు.

Krithi Shertty Latest Photoshoot Pics
Krithi Shertty Latest Photoshoot Pics

చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ సినిమా క్రిస్మ‌స్ కానుక‌గా విడుద‌ల కానుంది. మరో మూవీలో హీరో రామ్‌తో జతకడుతోంది కృతి శెట్టి. లింగుసామి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ యూనిట్‌ కూడా కృతి శెట్టి బర్త్ డే పోస్టర్‌ విడుదల చేసింది. దీంతోపాటు సుధీర్ బాబు సరసన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చేస్తోంది.

Krithi Shertty Latest Photoshoot Pics
Krithi Shertty Latest Photoshoot Pics

యూత్ స్టార్ నితిన్‌తో ‘మాచర్ల నియోజకవర్గం’ అనే మూవీలో నటించనుంది. ముఖ్యంగా టాలీవుడ్‌ మన్మధుడు అక్కినేని నాగార్జున ‘బంగార్రాజు’ మూవీలో చాన్స్‌ కొట్టేసింది కృతి శెట్టి. ఈ మూవీలో నాగచైతన్యతో రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతుంది. సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుంటుంది.

తాజాగా కృతి శెట్టి కొన్ని క్యూట్ పిక్స్ సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, ఇవి నెటిజన్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. లాంగ్ ఫ్రాక్ లో క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్ ఇస్తూ అంద‌రి మ‌న‌సులు దోచుకుంటుంది. కృతిని చూసి నెటిజ‌న్స్ థ్రిల్ అవుతున్నారు.