Prabhas: ప్ర‌భాస్ సీక్రెట్స్ రివీల్ చేసిన కృతి స‌న‌న్‌.. ఆశ్య‌ర్య‌పోతున్న అభిమానులు

Prabhas యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న‌కే దేశ విదేశాల్లోను విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న సినిమాల‌పై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. ఇప్ప‌టికే రాధే శ్యామ్ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సిద్ధం కాగా, ఇప్పుడు స‌లార్,ఆదిపురుష్, ప్రాజెక్ట్, స్పిరిట్ చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు.

TheNewsQube-

ప్ర‌భాస్ పాన్ ఇండియా ప్రాజెక్టులలో ‘ఆదిపురుష్’ కూడా ఒకటి. రామాయణం ఆధారంగా అత్యంత్య ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతునన్న ‘ఆదిపురుష్’లో ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ కనిపించనున్నారు.

 

దర్శకుడు ఓం రౌత్ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను చాలా వేగంగా పూర్తి చేస్తున్నారు. రీసెంట్‌గా హీరోయిన్ కృతి సనన్ కూడా తన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసింది. దర్శకుడు ఓం రౌత్ స్వయంగా ఈ విషయాన్నీ తెలియజేస్తూ ట్వీట్ చేశారు. “ప్రియమైన కృతి, మిమ్మల్ని జానకి పాత్రను చూడటం అద్భుతంగా ఉంది. మీ భాగం షూటింగ్ అప్పుడే పూర్తయ్యిందంటే నమ్మలేకపోతున్నాను. ఎంత అద్భుతమైన ప్రయాణం !” అంటూ కృతితో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫోటోలను షేర్ చేశారు.

తాజాగా కృతి సనన్ ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ సీక్రెట్స్ రివీల్ చేసింది. రియల్ లైఫ్ లో ప్రభాస్ ఎలా ఉంటాడో తెలిపింది. సాధారణంగా ప్రభాస్ ఒంటరిగా ఉండేదుకు ఇష్టపడతాడు. అవసరమైతే తప్ప మాట్లాడడు. కొత్త వారితో మాట్లాడేందుకు బాగా ఇబ్బంది పడతాడు. ప్రభాస్ కి కొంచెం సిగ్గు ఎక్కువ. కొత్తవాళ్లతో మాట్లాడేందుకు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు.

ఒక‌రికి సమయం కేటాయించి వారితో మాట్లాడితే.. ప్రభాస్ కూడా బాగా మాట్లాడతాడు. జోకులు కూడా వేస్తాడు. ప్రభాస్ వద్ద ఎప్పుడూ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అని కృతి సనన్ పేర్కొంది. సెట్స్ లో అందరూ తెలిసిన వాళ్లే కాబట్టి ప్రభాస్ జోకులతో చెలరేగుతుంటాడు అని కృతి సనన్ తెలిపింది. ఇక ప్రభాస్ వీలుచిక్కినప్పుడల్లా తన కో స్టార్స్ కి డిన్నర్ పార్టీ ఇస్తుంటాడు. హైదరాబాద్ బిర్యానీ, ఆంధ్ర రుచులని వారికి పరిచయం చేస్తుంటాడు.