Kristen Stewart: సీక్రెట్ వివాహం చేసుకున్న హీరోయిన్‌.. హాట్ టాపిక్‌గా గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో పెళ్లి

Kristen Stewart: సెల‌బ్రిటీల‌కు సంబంధించిన ఏ విష‌య‌మైన అభిమానుల‌కి ఆస‌క్తిక‌రంగానే ఉంటుంది. ఇక వారి ప్రేమ‌, పెళ్లి, ఎఫైర్స్ వంటి వాటిపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ ఎక్కువ క‌న‌బ‌రుస్తుంటారు. అంతేకాక కొంద‌రు విమ‌ర్శ‌లు కూడా చేస్తుంటారు. అయిన‌ప్ప‌టికీ వారు ఏవి ప‌ట్టించుకోకుండా త‌మ ప్ర‌యాణాన్ని ముందుకు సాగిస్తుంటారు. అయితే స్వలింగ సంపర్కం, స్వలింగ వివాహాలు విదేశాలలో చాలా కామన్. అది సెల‌బ్రిటీస్ చేస్తే మాత్రం పెద్ద న్యూస్ అవుతుంది.

kristen stewart
kristen stewart

‘ట్విలైట్’ భామ క్రిస్టెన్‌ స్టెవార్ట్‌ రహస్య వివాహం చేసుకుందని, అదీ తన గర్ల్‌ఫ్రెండ్‌నేనన్న వార్తలు హాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ట్విలైట్‌’, ‘స్నో వైట్‌ అండ్‌ ది హంట్స్‌మ్యాన్‌’ లాంటి సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న క్రిస్టెన్‌(31) చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొద‌లు పెట్టింది. ఈ అమ్మ‌డు స్క్రీన్ రైటర్ డైలాన్‌ మెయెర్‌తో 2019 నుంచి డేటింగ్‌లో ఉంది.

ఇటీవ‌ల క్రిస్టెన్ లాస్ ఏంజెల్స్‌లోని సెలూన్ వ‌ద్ద ఫొటోగ్రాఫ‌ర్స్‌కి చిక్కింది. చేతికి రింగ్ క‌నిపించ‌డం, అలాంటి రింగ్ డైలాన్‌ వేలికి కూడా కనిపించడంతో ఇద్దరి రహస్య వివాహం జరిగిపోయిందని కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ పుకార్లపై ఇద్దరూ స్పందించాల్సి ఉంది.

క్రిస్టెన్‌ స్టెవార్ట్‌ గతంలో ఆ చిత్ర హీరో రాబర్ట్‌ పాటిన్‌సన్‌తోనూ రిలేషన్‌షిప్‌ నడిపించింది. ఆ తర్వాత డైరెక్టర్‌ రుపెర్ట్ శాండర్స్‌తో కొన్నాళ్లూ, ఆ తరువాత విజువల్‌ ఎఫెక్ట్స్‌ ప్రొడ్యూసర్‌ అలిసియా కార్గిలేతో, న్యూజిలాండ్‌ మోడల్‌ స్టెల్లా మాక్స్‌వెల్‌తోనూ డేటింగ్‌ చేసింది. ఆపై ఓ టీవీ షో టైంలో డైలాన్‌ మెయర్‌కి దగ్గరై డేటింగ్‌ చేస్తూ.. లాస్‌ ఏంజెల్స్‌లో ఇద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు.

ఈ మ‌ధ్య తాను ఫెమినిస్ట్‌నని, బైసెక్సువల్‌ అని బహిరంగంగా ప్రకటించుకుంది స్టెవార్ట్‌. గర్ల్‌ఫ్రెండ్‌తో బయట కనిపిస్తే ఛాన్స్‌లు ఇవ్వమని కొందరు ప్రొడ్యూసర్లు ఆమెతో చెప్పినప్పటికీ.. క్రిస్టెన్‌ మాత్రం ఆ వార్నింగ్‌ను లైట్‌ తీసుకుంది. గర్ల్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరగడమే కాకుండా.. పార్టీలకు సైతం హాజరవుతూ వస్తోంది.