Krishnavamsi : కృష్ణవంశీ రంగ మార్తాండ కూడా బరిలోకి దిగబోతోంది..ఈ సారి బ్లాక్ బస్టర్ మిస్ అవదంటున్నారు ..!

Krishnavamsi : కృష్ణవంశీ .. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అయితే ఈ క్రియేటివ్ డైరెక్టర్ కి గత కొంతకాలంగా కృష్ణవంశీ కి లక్ కలిసి రావడం లేదు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. దాదాపు రెండేళ్ళకి పైగా కష్టపడి చేసిన నక్షత్రం అన్న సినిమా కూడా భారీ డిజాస్టర్ గా మిగిలింది. అంతకముందు వచ్చిన సినిమాలు ఫ్లాప్ ని మూటకట్టుకున్నాయి. నక్షత్రం సినిమా వచ్చి మూడేళ్ళు దాటిపోయింది. అయితే ఈసారి ఒక రీమేక్ కథ తో వస్తున్నాడు కృష్ణవంశీ.

krishnavamsi-ranga-martanda-is-not-going-to-miss-block-buster-by-this
krishnavamsi-ranga-martanda-is-not-going-to-miss-block-buster-by-this

మరాఠీలో సూపర్ హిట్ గా నిలిచిన ‘నటసామ్రాట్’ సినిమాకు రంగ మార్తాండ అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతోంది.కాగా తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి అయిందని తెలుస్తోంది. వాస్తవంగా లాక్ డౌన్ కి ముందే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కాని కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. బ్యాలెన్స్ టాకీపార్ట్ ని ఇటీవల కంప్లీట్ చేశారట. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతుందని తెలుస్తోంది. ఇక ఒరిజినల్ వెర్షన్ లో నానా పటేకర్ పోషించిన పాత్రను ప్రకాష్ రాజ్ చేస్తుండగా.. ప్రకాష్ రాజ్ సరసన రమ్యకృష్ణ నటిస్తోంది.

Krishnavamsi : రంగ మార్తాండ మీదే  చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు.

అంతేకాదు దాదాపు 20 సంవత్సరాల తరువాత తన సతీమణి రమ్యకృష్ణ ని డైరెక్ట్ చేయడం విశేషం. ఈ సినిమాలో అనసూయ పాత్ర కథలో కీలకంగా ఉంటుందట. అలాగే బ్రహ్మానందం ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజ సంగీతం అందిస్తున్నారు. గతంలో కృష్ణవంశీ – ఇళయరాజ కాంబినేషన్ లో అంత:పురం సినిమా వచ్చి పెద్ద మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇక చందమామ తర్వాత మళ్ళీ కృష్ణవంశీ కి ఆ రేంజ్ హిట్ దక్కలేదు. రాం చరణ్ తో చేసిన గోవిందుడు అందరివాడేలే కూడా ఫ్లాప్ గా మిగిలింది. ఇక ప్రస్తుతం రూపొందుతున్న రంగ మార్తాండ మీదే కృష్ణవంశీ చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. కాగా ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం.

Advertisement