Krishnavamshi : ‘రంగమార్తాండ’ కోసం చిరంజీవి జీవితాన్ని ఆవిష్కరించిన కృష్ణవంశీ.!

NQ Staff - December 21, 2022 / 04:22 PM IST

Krishnavamshi : ‘రంగమార్తాండ’ కోసం చిరంజీవి జీవితాన్ని ఆవిష్కరించిన కృష్ణవంశీ.!

Krishnavamshi : ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ చాలాకాలంగా ‘రంగమార్తాండ’ సినిమాని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి సాయం కూడా తీసుకున్నాడు కృష్ణవంశీ.

ప్రకాష్ రాజ్, అనసూయ తదితరులు ఈ సినిమాలో ప్రధాన తారాగణం. అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘రంగమార్తాండ’ సినిమాని దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ‘షాయరీ’ని విడుదల చేశారు.

చిరంజీవి జీవితాన్ని ఆవిష్కరించినట్లుందే..

లక్ష్మీభూపాల ఈ షాయరీని రాయగా, చిరంజీవి దీన్ని పఠించారు. పఠించారనాలా.? అందులో జీవించారనాలా.? నిజానికి, ఇది పూర్తిగా చిరంజీవి నట జీవితానికి సంబంధించిన ‘బయోపిక్’ తరహాలో వుంది. అందుకేనేమో, చిరంజీవి ఒకింత ఎమోషనల్ అయ్యారు.. దీన్ని చెబుతున్నప్పుడు.

అన్నట్టు, ఇది షూట్ చేసి చాన్నాళ్ళే అయినట్టుంది.. చిరంజీవికి చేతికి గతంలో చిన్నపాటి సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. బహుశా అప్పుడు రికార్డ్ చేసి వుంటారు.. చేతికి ఆ కట్టు అలాగే కనిపిస్తోంది.
చిరంజీవికి పెద్ద అభిమాని కృష్ణవంశీ. ‘రంగమార్తాండ’ ఓ నటుడి కథ. దాంతో, చిరంజీవిని తెరపై కాకపోయినా, ఈ షాయరీలో ఆవిష్కరించే ప్రయత్నం లక్ష్మీభూపాల ద్వారా కృష్ణవంశీ చేసినట్టుంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us