Prabhas: ప్ర‌భాస్ ఫోన్‌లో కృష్ణం రాజు పేరు ఏమ‌ని ఉంటుందో తెలుసా?

Prabhas: బాహుబ‌లి సినిమాతో ప్ర‌పంచ వ్యాప్తంగా క్రేజ్ అందుకున్న ప్ర‌భాస్ వ‌రుస బెట్టి సినిమాలు చేస్తున్నాడు. గ‌తంలో ఆయ‌న తెలుగు ప్రేక్షకులకు మాత్రమే పరిమితం. ఇప్పుడు ప్రభాస్‌ స్టామినా ఈ సినిమాతో ఒక్కసారిగా విశ్వవ్యాప్తమైంది. ప్రస్తుతం ప్రభాస్‌ నుంచి ఓ సినిమా వస్తుందంటే ఆ సినిమాపై యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ దృష్టి పడుతోంది.

TheNewsQube-

Prabhas

బాహుబలి తర్వాత వచ్చిన సాహో తెలుగులో పెద్దగా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినా బాలీవుడ్‌లో మాత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్, స‌లార్, ఆదిపురుష్‌., నాగ్ అశ్విన్ చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. ఇక త్వ‌ర‌లో స్పిరిట్ అనే సినిమా కూడా మొద‌లు పెట్ట‌నున్నాడు.

అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌ వంగ దర్శకత్వంలో ప్రభాస్ చేయ‌నున్న స్పిరిట్ చిత్రాన్ని . టీ సిరీస్‌, సందీప్‌ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘స్పిరిట్‌’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు అత్యంత భారీ బడ్జెట్‌ను కేటాయించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 8 భాషల్లో విడుదల చేయనున్నారు.

41 ఏళ్ల ప్ర‌భాస్ పెళ్లి మాట ప‌క్క‌న బెట్టి సినిమాలు చేసుకుంటున్నాడు. అయితే తాజాగా ప్ర‌భాస్ పెళ్లిపై ఆయ‌న పెద్ద‌మ్మ స్పందించింది. ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు పూర్తైన తరువాతే పెళ్లి చేసుకుంటానని ప్రభాస్ చెప్పాడని శ్యామలాదేవి పేర్కొన్నారు. ప్రభాస్ తనను ప్రేమగా కన్నమ్మ అని పిలుస్తాడని పెదనాన్న కృష్ణంరాజును పెద్ద బాజీ అని పిలుస్తాడని ఫోన్లలో సైతం తమ పేర్లను అదే విధంగా సేవ్ చేసుకున్నాడని శ్యామలాదేవి చెప్పుకొచ్చారు.

ప్రభాస్‌ బర్త్‌డే నేపథ్యంలో స‌లార్ నుండి ఓ వీడియో బయటకు రాగా, దానిని చూసి ఫ్యాన్స్‌ అంత పండగ చేసుకుంటున్నారు. కాగా సలార్‌తో పాటు ప్రభాస్‌ బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ డైరెక్షన్‌లో రూపొందుతోన్న ‘ఆదిపురుష్‌’ షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నాడు. అంతేగాక రాధ కృష్ణ తెరకెక్కించిన రాధేశ్యామ్‌ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతోంది.