Krishnam Raju: ప‌ని మ‌నిషికి కృష్ణం రాజు దంప‌తులు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారో చూడండి..!

Krishnam Raju: టాలీవుడ్ సినిమా ఇండ‌స్ట్రీలో కృష్ణం రాజు ఫ్యామిలీకి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ప్రత్యేకమైన మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను, అభిమానులను సంపాదించుకున్సారు కృష్ణం రాజు. సీనియర్ హీరోలలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు, స్థానం ఉన్న కృష్ణంరాజు.. తన కెరీర్‌ను హీరోగా మొదలు పెట్టి.. ఆ తర్వాత విలన్‌గా మారి.. ఆపై రెబల్ స్టార్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Krishnam Raju

కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈయన ఇపుడు తన తమ్ముడు తనయుడు ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘రాధే శ్యామ్’లో ఓ ముఖ్యపాత్రను చేస్తున్నట్టు సమాచారం. దాంతో పాటు ‘ఆదిపురుష్’ సినిమాలో కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ చేయనున్నట్టు సమాచారం.

సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌లోను త‌న‌దైన ముద్ర వేసిన కృష్ణం రాజు చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరినీ ఎంతో ప్రేమగా, గౌరవంగా చూసుకుంటారు. ఆయన కుటుంబం అతిథులకు ఎంతో మంచి మర్యాద చేస్తారనే టాక్ కూడా ఉంది. అదే కూడా ప్ర‌భాస్‌కి వ‌చ్చింది. సెట్స్‌లో అప్పుడ‌ప్పుడు ప్ర‌త్యేక వంట‌లతో భోజ‌నం పెడుతుంటాడు.

కృష్ణంరాజు ఇంట్లో గడిచిన 25 సంవత్సరాలుగా పద్మ అనే మహిళ పని చేస్తుంది. ఇన్నాళ్లు తమ కుటుంబానికి అన్ని రకాలుగా సేవలు చేస్తున్నది పద్మ. ఈ సందర్భంగా 25 ఏండ్ల వేడుక నిర్వహించారు కృష్ణంరాజు కుటుంబ సభ్యులు. 25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అంటూ ఆమె చేత కేక్ కట్ చేయించారు కృష్ణంరాజు ఫ్యామిలీ మెంబర్స్.

ఈ సందర్భంగా కృష్ణంరాజు దంపతుల ఆశీర్వాదం తీసుకుంది పద్మ. కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి పద్మకు బంగారు చైన్ బహుమతిగా అందజేశారు. ఇన్నేళ్లుగా తమకు తోడుగా ఉన్న పద్మకు ధన్యవాదాలు చెప్తూ తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది ప్రభాస్ సోదరి ప్రసీద. చతను ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రసీద ఆకాంక్షించారు.