Krishnam Raju: కృష్ణం రాజుకి ప్ర‌మాదం.. ఆందోళ‌న‌లో రెబ‌ల్ స్టార్ ఫ్యాన్స్

Krishnam Raju: ఒక‌వైపు సాయి ధ‌ర‌మ తేజ్ రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డి అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుండ‌గా, ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై అభిమానులు ఆందోళ‌న చెందుతూనే ఉన్నారు. ఇక తాజ‌గా రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు ప్రమాదవశాత్తు కాలుజారి క్రింద పడినట్లు తెలుస్తుంది. దీనితో ఆయన తుంటికి ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం.

Krishnam Raju Accident Joined in Hospital
Krishnam Raju Accident Joined in Hospital

మ‌రో వైపు రెబల్ స్టార్ కృష్ణం రాజు కొన్ని రోజులుగా న్యుమోనియాతో బాధపడుతున్నారని, అతని కుటుంబ సభ్యులు నిన్న రాత్రి ఆసుపత్రికి తీసుకెళ్లారని స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. కృష్ణం రాజు పరిస్థితి ఆందోళనకరంగా లేనప్పటికీ, అతను కనీసం 48 గంటలు ఐసీయూలో ఉండాల‌ని వైద్యులు సూచించిన‌ట్టు చెబుతున్నారు.

150 కి పైగా చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న కృష్ణం రాజు పూర్తిగా కోలుకున్నాక డిశ్చార్జ్ చేస్తామ‌ని వైద్యులు చెప్పిన‌ట్టు పేర్కొంటున్నారు. ఆయన కార్యాలయం వర్గాలు మరో వాదన వినిపిస్తున్నాయి. కృష్ణంరాజు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని.. కేవలం రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం అపోలోకి వచ్చినట్లు, ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులతో చర్చించినట్లు తెలిపారు. సాయి ధరమ్ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను అని కృష్ణంరాజు గారు చెప్పారు. త్వరలో యూకే వెళ్లాల్సి ఉన్నందున రొటీన్ హెల్త్ చెకప్ చేసుకోవడానికి అపోలోకి వచ్చినట్లు కృష్ణంరాజు కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీనితో అసలు కారణం ఏమిటన్న సందిగ్దత కొనసాగుతుంది

కృష్ణం రాజు తన కెరీర్‌లో 183 కి పైగా ఫీచర్ ఫిల్మ్‌లలో నటించారు. అతను 1966 లో చిలక గోరింకతో తొలిసారిగా సినిమా ప్రారంభించాడు, జీవిత తరంగాలు, కృష్ణవేణి, భక్త కన్నప్ప, అమరదీపం, సతీ సావిత్రి, కటకటాల రుద్రయ్య, మన వూరి పాండవులు, రంగూన్ రౌడీ, శ్రీ వినాయక విజయము, సీతా రాములు, టాక్సీ డ్రైవర్, త్రిశూలం, ధర్మాత్ముడు, బొబ్బిలి బ్రహ్మన్న, తండ్రం నాయకుడు, అంతిమ తీర్పు, బావ బావమరిది, పల్నాటి పౌరుషం వంటి చిత్రాల‌తో ఎంత‌గానో అల‌రించారు.రాధేశ్యామ్ చిత్రంలోను ఆయ‌న కీల‌క పాత్ర పోషించిన‌ట్టు తెలుస్తుంది.