Krishna Vrinda Vihari Review : కృష్ణ వ్రింద విహారి రివ్యూ : పూర్‌ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌

NQ Staff - September 23, 2022 / 09:28 AM IST

160245Krishna Vrinda Vihari Review : కృష్ణ వ్రింద విహారి రివ్యూ : పూర్‌ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌

Krishna Vrinda Vihari Review : నాగ శౌర్య హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు కానీ ఏ ఒక్కటి కూడా ఆయనకి సక్సెస్ ని ఇవ్వలేక పోతున్నాయి. అయినా కూడా ఆయన యొక్క హోం బ్యానర్ లో సినిమాలు నిర్మాణం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాను కూడా ఆయన తల్లి నిర్మించారు. మరి ఈ సినిమాతో అయినా నాగ శౌర్యకి సక్సెస్ దక్కిందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

Krishna Vrinda Vihari Review

Krishna Vrinda Vihari Review

కథ :

సాంప్రదాయ బ్రహ్మిణ్‌ కుర్రాడైన కృష్ణ(నాగ శౌర్య) తాను వర్క్ చేసే ఆఫీస్ లో నార్త్‌ అమ్మాయి అయిన వ్రింద(షిర్లీ సెటియా) తో ప్రేమలో పడతాడు. ఆమెను మెప్పించేందుకు చాలా ప్రయత్నాలు చేసి ప్రేమలో పడేస్తాడు. ఇద్దరి పెళ్లి కూడా అవుతుంది. పెళ్లి తర్వాత వారు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటీ.. వారి కుటుంబ సభ్యులు కృష్ణ మరియు వ్రింద యొక్క వివాహం కు ఎలా స్పందిస్తారు.. విభిన్నమైన అలవాట్లు ఉన్న వారిద్దరి వైవాహిక జీవితం ఎలా సాగింది అనేది కథ.

నటీనటుల నటన :

బ్రహ్మిణ్‌ కుర్రాడిగా నాగ శౌర్య మెప్పించాడు. బాడీ లాంగ్వేజ్ మొదలుకుని ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ సినిమాలో నటించినట్లుగా కనిపించింది. విభిన్నమైన లుక్ తో కూడా ఆకట్టుకున్నాడు. కానీ ఆయన నటన మరియు కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. షిర్లీ సెటియా నటన గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ ఆమె లుక్ పరంగా పర్వాలేదు అనిపించింది. ఇద్దరి మధ్య సన్నివేశాలు కొన్ని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. సినిమాలో ఇతర పాత్రల్లో నటించిన వారు వారి యొక్క పాత్రల పరిధిలో నటించి మెప్పించారు.

Jathiratnalu Beauty Faria Abdhulla in White Saree Pics Goes Viral (1)

Krishna Vrinda Vihari Review

టెక్నికల్‌ వాల్యూస్ :

దర్శకుడు కథ ను ఇంకాస్త బలంగా రాసుకుని ఉంటే బాగుండేది. స్క్రీన్‌ ప్లే విషయంలో అస్సలు ఆకట్టుకోలేక పోయాడు. లాజిక్ లేని సన్నివేశాలు.. ఆకట్టుకోని ఎమోషనల్ సన్నివేశాలతో దర్శకుడు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు. సంగీతం యావరేజ్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ విషయంలో పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. సినిమాటోగ్రపీ యావరేజ్ గానే సాగింది. డైలాగ్స్ గొప్ప గొప్పగా ఏమీ లేవు. పైగా కొన్ని సన్నివేశాలు సింక్ అయినట్లుగా అనిపించలేదు. ఎడిటింగ్‌ లో లోపాలు ఉన్నాయి. నిర్మాణాత్మక విలువలు బాగానే ఉన్నాయి. కథకు తగ్గట్లుగా హీరో గారి తల్లి బాగానే ఖర్చు చేసినట్లుగా ఉన్నారు.

Krishna Vrinda Vihari Review

Krishna Vrinda Vihari Review

ప్లస్ పాయింట్స్ :

సెకండ్‌ హాఫ్‌ లో కొన్ని సన్నివేశాలు

కామెడీ ట్రాక్‌

నాగ శౌర్య

మైనస్ పాయింట్స్ :

కథ మరియు కథనం,

ఎడిటింగ్‌,

కథలో బలమైన పాత్రలు చూపించలేదు

విశ్లేషణ :

నాగ శౌర్య కెరీర్‌ కష్టాల్లో ఉంది. ఈ సమయంలో ఆయనకు ఈ సినిమా తప్పనిసరిగా సక్సెస్ అవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన ఈ సినిమాతో కూడా మెప్పించలేక పోయాడు. మంచి కథ ఎంపిక చేసుకోవడంలో నాగ శౌర్య మళ్లీ విఫలం అయ్యాడనే చెప్పాలి. పెద్దగా పోటీ లేకుండా వచ్చిన ఈ సినిమా కు బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూళ్లు నమోదు అయ్యే అకాశం కనిపించడం లేదు.

రేటింగ్ : 2.0/5.0