Krishna vamsi: రంగ‌మార్తాండ‌లో బ్ర‌హ్మానందం సీన్ అద్భుతంగా ఉంటుంద‌న్న కృష్ణ వంశీ

Krishna vamsi: క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ వంశీ కొన్నాళ్లుగా స‌రైన స‌క్సెస్ లేక డీలాప‌డ్డారు. మంచి హిట్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, ఆయ‌న ఇప్పుడు రంగ‌మార్తాండ అనే సినిమా చేస్తున్నారు. కృష్ణ వంశీ సినిమా వస్తుందంటే సహజంగా ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడతాయి. గతంలో అద్భుతమైన సినిమాలను అందించారు కృష్ణవంశీ.

krishna vamsi prasies bhramanadam
krishna vamsi prasies bhramanadam

శ్రీకాంత్ నటించిన మహాత్మ సినిమా తర్వాత కృష్ణ వంశీ హిట్ అందుకోలేక పోయాడు. చివరగా చేసిన నక్షత్రం సినిమా దారుణంగా నిరాశపరిచింది. దాంతో ఆయన కొంత గ్యాప్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు ఆయన రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. రంగమార్తాండ సినిమా మరాఠి సినిమాకు రీమేక్ గా రాబోతుంది. ఇక ఈ సినిమాలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

మరాఠీలో హిట్ అయిన `నటసమ్రాట్` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు కృష్ణవంశీ.మరాఠీలో టైటిల్ పాత్రని వెర్సటైల్ ఆర్టిస్ట్ నానా పటేకర్పోషించారు. ఇప్పుడు ఇదే పాత్రను తెలుగులో ప్రకాష్ రాజ్ పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో మరో కీలక పాత్రలో బహ్మానందం కనిపించనున్నారు. బ్రహ్మానందం మునుపెన్నడూ చేయని పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది.

తాజాగా కష్ణ వంశీ బ్ర‌హ్మానందం పాత్ర‌కు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. ఇప్పుడే బ్ర‌హ్మానందం, న‌ట‌రాక్ష‌స ప్ర‌కాశ్ రాజ్ మ‌ధ్య అద్భుత‌మైన సీన్ పూర్తైంది. బ్రహ్మానందం నెవ‌ర్ బిఫోర్ ప‌ర్‌ఫార్మెన్స్ ఇచ్చారు అని కృష్ణ‌వంశీ త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. ఈసినిమాలో రమ్యకృష్ణ- అనసూయ- అలీ రెజా- శివాత్మిక రాజశేఖర్- రాహుల్ సిప్లిగంజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుంది. ఈ క్లైమాక్స్ ఎమోషనల్ గా ఉండనుందని తెల్సుస్తుంది. ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి గాత్రం అందించ‌నున్నారు.