PRABHAS: ప్రభాస్ ఇంట్లో ప్రత్యేకంగా శాంతి పూజలు జరిపిస్తున్న కృష్ణంరాజు.. ఎందుకో తెలుసా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఈ పేరంటేనే ఓ బ్రాండ్.. అభిమానుల్లో విపరీతమైన క్రేజ్.. సొంత టాలెంట్ తో అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ లో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి రేంజ్ పెంచుకున్నారు. ప్రస్తుతం రెండేళ్ళకు తగ్గట్టుగా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభాస్ ఇంట్లో ప్రత్యేకంగా శాంతి పూజలు చేస్తున్నారట. ఈ నెల రెండో తేదీన ముంబాయి, ఓ ఫిల్మ్ స్టూడియోలో ఆదిపురుష్ సినిమాని ప్రారంభించారు. అయితే ఇటీవల ఈ సినిమా షూటింగ్ లో యాక్సిడెంట్ జరిగింది. షూటింగ్ ప్రారంభించిన రోజు ప్రమాదం జరగడంతో సినిమాకి అనుకోని అవాంతరాలు ఏర్పడ్డాయని ఫిల్మ్ టీమ్ అభిప్రాయపడ్డారు.

మన హీరోలు ఏదైనా సినిమా ప్రారంభించే ముందు ముహుర్తాలు చూసుకుంటారు. సినిమా అంటే కోట్లలో జరిగే వ్యవహారం కనుక అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే ముహుర్తాలు విషయంలో హీరోలకు, నిర్మాతలు, దర్శకులు పట్టించుకుంటారు. దీంతో ప్రభాస్ ఆదిపురుష్ సినిమా షూటింగ్ కి ముహుర్తం మళ్ళీ ఫిక్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆదిపురుష్ కోసం నిర్ణయించిన ముహుర్తం సరిగా లేదని.. అందుకే సెట్ కి అగ్ని ప్రమాదం జరిగిందని కొంతమంది పండితులు చెబుతున్నారు. మరోవైపు ఈ సినిమా రాముడి గురించి తీసే నేపథ్యంలో అన్ని రకాల ముహుర్తాలు సరిగా ఉండేలా చూసుకోవాలని దర్శకనిర్మాతలు మరోసారి ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.

అయితే ఇప్పుడు ప్రభాస్ సినిమాల ముహుర్తాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కృష్ణంరాజు సలహాలిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే ప్రస్తుతం ప్రభాస్ ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే పనిలో ప్రభాస్ పెళ్ళి కోసం కూడా కొన్ని శాంతులు కూడా చేయిస్తున్నట్లు నెటింట్లో వైరల్ అవుతుంది. ప్రభాస్ కూడా ఈ పూజల్లో పాల్గొంటున్నారట. ఆదిపురుష్ సినిమాలో తల్లి కౌసల్య పాత్ర కోసం హేమమాలిని కనిపించనున్నట్లు టాక్. దశరథుడి పాత్రలో కృష్ణంరాజు నటిస్తున్నారు. ఈ సినిమా కోసం దాదాపు 300 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతున్న ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది

Advertisement