Prakash Raj: ప్ర‌కాశ్ రాజ్ కామెంట్స్‌పై ఎన్నిక‌ల అధికారి వివ‌ర‌ణ.. నాకు ఎలాంటి సంబంధం లేద‌ని కామెంట్

Prakash Raj: మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల రచ్చ ఇంకా ముగియ‌లేదు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల మధ్య మా ఎన్నికలు జరిగాయి.. రసవత్తరంగా సాగిన ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు విజయం సాధించి మా అధ్యక్ష పీఠాన్ని వరించాడు. మంచు ప్యానల్ సభ్యులు ఎన్నికలలో రిగ్గింగ్ చేశారని.. సీసీ టీవీ ఫుటేజ్ తమకు అందించాలని ప్రకాష్ రాజ్ ప్యానల్ ఆరోపిస్తుంది.

TheNewsQube-
Krishna Mohan Commens on Prakash Raj Comments
Krishna Mohan Commens on Prakash Raj Comments

తాజాగా ప్ర‌కాశ్ రాజ్ .. రౌడీషీటర్లు ‘మా’ ఎన్నికల్ని ప్రభావితం చేశారని ఆరోపించారు. ఇదే విషయాన్ని మరోసారి ఈసీ కృష్ణమోహన్‌ దృష్టికి తీసుకెళ్లారు. పోలింగ్ రోజున జరిగిన తిట్లదండకం, బెదిరింపులకి సంబంధించి సీసీ ఫుటేజ్‌ ఇవ్వాలని ఇప్పటికే కోరారు. ఇప్పుడు మరోసారి రౌడీషీటర్ల పాత్ర ఉందంటూ లేఖాస్త్రం సంధించారు. ఈ వివాదంపై ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ వివరణ ఇచ్చారు.

ఈ వివాదంపై ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ వివరణ ఇచ్చారు. ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించడం వరకు మాత్రమే నా ప్రమేయం..తరువాత పరిణామాలతో నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఆయన స్పష్టం చేశారు. అలాగే ప్రకాష్ రాజ్ నుండి తాజాగా ఎలాంటి లెటర్ రాలేదని అన్నారు కృష్ణ మోహన్.

Krishna Mohan Commens on Prakash Raj Comments
Krishna Mohan Commens on Prakash Raj Comments

రసవత్తరంగా సాగిన ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు విజయం సాధించి మా అధ్యక్ష పీఠాన్ని వరించాడు. అయితే మంచు ప్యానల్ సభ్యులు ఎన్నికలలో రిగ్గింగ్ చేశారని.. సీసీ టీవీ ఫుటేజ్ తమకు అందించాలని ప్రకాష్ రాజ్ ప్యానల్ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో మంచు విష్ణు స్పందిస్తూ.. ప్రకాష్ రాజ్ సీసీ ఫుటేజ్ తీసుకోవచ్చని.. తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు.