Krishna: ర‌మేష్ బాబుకి నివాళులు అర్పించిన కృష్ణ‌, ఆయ‌న భార్య‌

Krishna: సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినీఆరంగేట్రం చేసిన రమేష్ బాబు నిన్న అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. దీర్ఘకాలిక కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. కానీ రమేష్ బాబు ఆసుపత్రికి చేరుకునే లోపే తుది శ్వాస విడిచినట్లు సమాచారం. మరణానికి కారణం కార్డియాక్ అరెస్ట్ అంటున్నారు.

kriskna condolcens ramesh babu
kriskna condolcens ramesh babu

ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మహాప్రస్థానంలో రమేష్ బాబు అంత్యక్రియలు జరగనున్నాయి. ర‌మేష్ మృత‌దేహాన్ని పద్మాలయా స్టూడియో కి తరలించారు.ఇండస్ట్రీకి చెందిన పలువురు రమేష్ బాబు మృతి దేహానికి నివాళులు అర్పించేందుకు పద్మాలయా స్టూడియో కి వస్తున్నారు. కొద్ది సేపటి క్రితమే కృష్ణ కూడా స్టూడియో కి చేరుకున్నారు. ఆయ‌నకు నివాళులు అర్పించి క‌న్నీరు పెట్టుకున్నారు.

ర‌మేష్ త‌ల్లి కూడా కొడుకుని చూసి క‌న్నీరు పెట్టుకుంది. కన్న కొడుకు విగ‌త‌జీవిగా క‌నిపించ‌డాన్ని వారు జీర్ణించుకోలేక‌పోయారు. ఇక మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం క‌రోనాతో ఐసోలేష‌న్‌లో ఉన్నాడు. ఈ క్ర‌మంలో ఆయ‌న చివరి చూపు నోచుకోలేక‌పోయాడు.

ర‌మేష్ బాబు బాల న‌టుడిగా కెరీర్‌ని ప్రారంభించారు. హీరోగా ప‌లు చిత్రాల‌లో న‌టించారు. అయితే ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణం అంద‌రిని బాధిస్తుంది. ఆయనకు కడసారి నివాళులు అర్పిస్తూ చిరంజీవితో పాటు పలువురు సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.

Hero Krishna's Son Ramesh Babu No More

‘రమేశ్‌బాబు మరణవార్త విని షాకయ్యాను. ఎంతో బాధ కలిగింది. కృష్ణగారికి, మహేశ్‌బాబు కుటుంబం మొత్తానికి ఇదే నా ప్రగాఢ సానుభూతి.. ఈ విషాదంలో నుంచి కోలుకునేందుకు ఆ భగవంతుడు రమేశ్‌ కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను అని చిరంజీవి ట్వీట్ చేశారు.