Krack : క్రాక్ దర్శకుడికి బాలయ్య గ్రీన్ సిగ్నల్.. షూటింగ్ డేట్ కూడా ఫిక్స్ ..?

Krack : క్రాక్ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని మంచి ఊపుమీద ఉన్నాడు యువ దర్శకుడు గోపీచంద్ మలినేని. గత మూడేళ్ళుగా సరైన హిట్‌లు లేక డీలా పడిన రవితేజ తో గోపీచంద్ క్రాక్ తీసి బాక్సాఫీసుల వద్ద వసూళ్ల వర్షం కురిపించారు. కరోనా తరువాత ఎంతో ధైర్యంతో క్రాక్ సినిమాను విడుదల చేశాడు గోపీచంద్ మలినేని. ఊహించని రీతిలో ప్రేక్షకులు సినిమాను ఆదరించారు. దీనితో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు మాస్ మహారాజ రవితేజ. ఈ మూవీతో క్రేజీ డైరెక్టర్ గాను తన ఇమేజ్‌ను పెంచుకున్నాడు గోపీచంద్ మలినేని. క్రాక్ సూపర్ హిట్ తరువాత ఈ యువ క్రేజీ దర్శకుడుకి వరుసపెట్టి ఆఫర్లు తలుపులుతడుతున్నాయి.

krack-balayya-gave-green-signal-to-krack-director-shooting-date-also-fixed
krack-balayya-gave-green-signal-to-krack-director-shooting-date-also-fixed

అయితే ఇవన్నీ పక్కన పెడితే క్రాక్ కంటే ముందే కమిట్ అయిన బాలయ్య సినిమాను షురూ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట గోపీచంద్ మలినేని. ఈ క్రేజీ డైరెక్టర్ చెప్పిన కథను నచ్చిన బాలకృష్ణ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడట. దీంతో ఈ మూవీ పనుల్లో నిమగ్నమయ్యాడు గోపీచంద్ మలినేని అంటున్నారు. బాలయ్య ఇమేజ్ కి తగ్గట్లుగా పక్కా మాస్ అంశాలను జోడించి కథను రెడీ చేశాడని సమాచారం. అయితే ప్రస్తుతం బాలయ్య.. బోయపాటి సినిమా చిత్రీకరణలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ మే 28న విడుదలయ్యేందుకు పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు బోయపాటి.

Krack : మైత్రీ మూవీ మేకర్స్ లో బాలయ్య, గోపీచంద్ మలినేని..?

ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాకే బాలయ్య, గోపీచంద్ సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. మే చివర్లోనే సినిమా షూటింగ్‌ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్. బాలయ్య బాబు కూడా ఈ మూవీకి డేట్స్ ఇచ్చేశారని టాక్ వినిపిస్తోంది. బీబీ 3 రిలీజ్ రోజే కొత్త ప్రాజెక్ట్ ని మొదలు పెట్టనున్నారని సమాచారం. ఇక ప్రీ ప్రొడక్షన్ పనుల్లో జోరును పెంచాడట గోపీచంద్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో బాలయ్యను డిఫరెంట్ లుక్‌లో చూపించేందుకు ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.

Advertisement