Kota Srinviasa Rao: నాగబాబు -కోట మ‌ధ్య న‌డుస్తున్న వార్.. మెగా బ్ర‌ద‌ర్‌పై మ‌ళ్లీ ఆగ్ర‌హించిన కోట

Kota Srinviasa Rao: మా ఎన్నిక‌ల పుణ్య‌మా అని మంచిగా ఉన్న సినీ ప్ర‌ముఖుల మ‌ధ్య పెద్ద గొడ‌వ‌లే జ‌రిగాయి.చిన్నవారు, పెద్ద వారు అనే తేడా లేకుండా ఒకరిపై ఒక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకున్నారు. ముఖ్యంగా కోట శ్రీనివాస‌రావు నాగ బాబుపై సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డం,దానికి నాగ బాబు దారుణంగా వ్య‌వ‌హ‌రించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

TheNewsQube-
Kota Srinviasa Rao and Nagababu Fight Each other
Kota Srinviasa Rao and Nagababu Fight Each other

ఈ మ‌ధ్య కోట ప‌లు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ .. ప‌లువురిపై విమ‌ర్శ‌లు చేస్తున్నాడు. ఇటీవల ఓ యుట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ యాంకర్‌ అనసూయ డ్రెస్పింగ్‌పై కోట చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయనీ తెలుస్తుంది. అంతకుముందు ‘మా’ ఎన్నికల నేపథ్యంలో విష్ణుకు మద్దతు ప్రకటించిన కోట అదే సమయంలో ప్రకాశ్‌ రాజ్‌పై చేసిన తీవ్ర విమర్శలు చర్చనీయాంశం అయ్యాయి.

తాజాగా నాగాబాబుని ఎండ‌గ‌ట్టారు. ‘చిరంజీవి ఒక పక్క, పవన్‌ కల్యాణ్‌ మరో పక్క వీరిద్దరు లేకపోతే ఈ నాగబాబు ఎవరు?. వారే లేకపోతే నాగబాబు అనే వ్యక్తి మామూలు నటుడు మాత్రమే. అతనేం ఉత్తమ నటుడు కాదు, గొప్ప నటుడు కాదు. ఆయనకేందుకు అసలు. గతంలో నాగబాబు ప్రకాశ్‌ రాజ్‌ను తిట్టారు. అది అందరికి తెలుసు. నేను ప్రకాశ్‌ రాజ్‌ను అన్నానని ఇప్పుడు ఆయన నన్ను విమర్శించారు.

అపుడు ఆయనను ఏమైనా అన్నానా? నాగబాబు నాపై చేసిన కామెంట్స్‌కు అప్పుడే నేను స్పందించి ఉంటే టీవీల్లో, చానల్లో డిబెట్‌లు అంటూ రచ్చ జరిగేది’ అంటూ కోట మండిపడ్డారు. అనంతరం ఇప్పటికి తాను అదే చెబుతానని, చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ లేకపోతే నాగబాబుకు గుర్తింపు లేదన్నారు. ఒక్క మెగా బ్రదర్‌ అనే గుర్తింపు తప్పా అంటూ కోట సంచలన కామెంట్స్‌ చేశారు.

కోట మా ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌కాశ్‌రాజ్ షూటింగ్‌కి రాడు అని, అలాంటి వ్య‌క్తిని అధ్య‌క్షుడిగా ఎలా నిల‌బెడతారంటూ మండిప‌డ్డాడు. అయితే ప్ర‌కాశ్ రాజ్‌కి స‌పోర్ట్‌గా ఉన్న మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ.. కొంతమందికి వయసు పెరుగుతుంది కానీ బుద్ధి పెరగదు.. రేపోమాపో పోయే కోట ఇంకా ఎప్పుడు మారతాడు అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విష‌యం తెలిసిందే.