Pawan Kalyan : ప‌వ‌న్ మాట‌ల‌కు నా క‌ళ్ల‌ల్లో నీళ్లు తిరిగాయి.. కోట శ్రీనివాస‌రావు స్ట‌న్నింగ్ కామెంట్స్

Pawan Kalyan : కోట శ్రీనివాస‌రావు తెలుగు తెర‌కు దొరికిన ఓ గ‌ని. ఆయన ఏ పాత్ర‌ల‌లోనైన ఇట్టే ఒదిగిపోతారు. ఆయ‌న ఏ పాత్రలోనైన ఎలాంటి డైలాగ్ అయిన ఇట్టే చెప్పి శ‌భాష్ అనిపించుకుంటారు. ఇటీవ‌ల ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో గత జ్ఞాప‌కాలు గుర్తు చేసుకుంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు కోట‌.

Kota Srinivas Rao about Pawan Kalyan
Kota Srinivas Rao about Pawan Kalyan

‘అత్తారింటికి దారేది’ సినిమా సక్సెస్‌మీట్‌ హైదరాబాద్‌ శిల్పకళావేదికలో జరిగింది. దాదాపు యూనిట్‌ మొత్తం ఆ వేడుకకు హాజరయ్యాం. చాలా భారీ ఎత్తున చేశారు. ఆ వేడుకలో పవనకల్యాణ్‌గారు ఆర్టిస్టులు అందరి గురించి మాట్లాడి నా వరకు వచ్చేసరికి ‘‘కోటగారు పెద్దవారు, ఆయన గురించి నేనేమని చెబుతాను? ఆయన గురించి మాట్లాడాలంటే నా వయసుగానీ, అనుభవం కానీ సరిపోదు’’ అన్నారు. ఫస్ట్‌టైమ్‌ అనుకుంటా ఒక వేదిక మీద నాకు కళ్ళు చెమర్చడం.

ఒక అరనిమిషం నా కళ్ళ నుండి నీళ్ళు కారాయి. హాల్లో జనాలందరూ ‘పవర్‌స్టార్‌ పవర్‌స్టార్‌’ అని కేకలు పెడుతుంటే, అంతటి క్రేజ్‌ ఉన్న నటుడు నా గురించి రెండు మాటలు గౌరవంగా చెప్పడం నాకు గొప్పగానే అనిపించింది. అదే వేదికమీద త్రివిక్రమ్‌ మాట్లాడుతూ ‘‘నాకు ఇష్టమైన నటుడు కోట శ్రీనివాసరావుగారు’’ అన్నారు.

ఆయన సినిమాల్లో ఎక్కువ వేషాలు చేయకపోయినా, చేసిందే తక్కువే అయినా జీవితంలో గుర్తుండిపోయే చిత్రాలు చేశాను. ఒక ఆర్టిస్టుగా నేను చేయదగ్గ పాత్రలను త్రివిక్రమ్‌ చిత్రాల్లో చేశా. నాలోని నటుణ్ణి వెలికితీసిమరీ మంచి వేషాలిచ్చి చేయించారు త్రివిక్ర‌మ్ అని కోట తెలిపారు.

ఇక ఓ సంద‌ర్భంలో రైటర్‌ ఎంత సెన్సిటివ్‌గా ఆలోచించకపోతే అలాంటి డైలాగులు పుడతాయి చెప్పండి.ఆ మాటే నేను త్రివిక్రమ్‌తో అంటే ‘నటుడిగా మీరేమైనా తక్కువ తిన్నారా కోటగారూ.. నేను డైలాగులే రాశాను. కానీ మీవి ఎక్స్‌ప్రెషన్స్‌, గొంతులో ఎక్స్‌ట్రా సౌండ్స్‌తో ఆ డైలాగుకు ప్రాణం పోశారు కదా. అలాంటివి మీకు ఎవరూ నేర్పక్కర్లేదు. సహజసిద్ధంగా వస్తూ ఉంటాయి’ అన్నారు ఆయన.