Jagapathi babu: జ‌గ‌ప‌తి బాబుతో ఎందుక‌లా అన్నానో కాని నాకు అన్యాయం జ‌రిగింది: కోట‌

Jagapathi babu: న‌ట‌న‌కు పెట్టిన కోట మన కోట శ్రీనివాస‌రావు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, కమెడియన్‌గా వేషాలు వేసి సినీ లోకాన్ని మెప్పించారు కోట. అయితే వయసు మీదపడటంతో ఈ మధ్య సినిమాలు తగ్గించేసిన ఆయన.. పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన అనుభవాలను, వ్యక్తిగత జీవితంలోని విషయాలను పంచుకుంటున్నారు.

TheNewsQube-
kota shares sad moments with jagapathi babu
kota shares sad moments with jagapathi babu

అత్తారింటికి దారేది’ సినిమా సక్సెస్‌మీట్‌ హైదరాబాద్‌ శిల్పకళావేదికలో జరిగితే దానికి దాదాపు యూనిట్‌ మొత్తం ఆ వేడుకకు హాజరయ్యామన్న ఆయన ఆ వేడుకలో పవన్ కల్యాణ్‌గారు ఆర్టిస్టులు అందరి గురించి మాట్లాడి నా వరకు వచ్చేసరికి ‘‘కోట గారు పెద్దవారు, ఆయన గురించి నేనేమని చెబుతాను? ఆయన గురించి మాట్లాడాలంటే నా వయసు గాని, అనుభవం కానీ సరిపోదు” అన్నారని పేర్కొన్నారు అంటూ ఇటీవ‌ల చాలా ఎమోష‌న‌ల్ అయ్యారు కోట‌.

ఇక తాజాగా త‌న జీవితంలో జ‌రిగిన ఓ హృద‌య విదార‌క విష‌యం పంచుకున్నారు. మా అబ్బాయిని ప్రోత్సహించి ధైర్యం చెప్పే బాధ్యత జె.డి. చక్రవర్తి, జగపతి బాబు తీసుకున్నారు. మా అబ్బాయి ఆంజనేయ ప్రసాద్‌ ‘గాయం- 2’ సినిమాలో నా కొడుకు వేషం వేశాడు. అయితే ఓ రోజు షూటింగ్‌ స్పాట్‌కెళ్లాక చూస్తే ఒక సీన్‌ కోసం అరేంజ్‌మెంట్స్‌ చేస్తున్నారు.

అది చూసి నా మనసుకు ఇబ్బందిగా అనిపించింది. ఆ రోజు మా అబ్బాయిని జగపతి బాబు చంపేసే సీన్‌ షూట్ చేస్తారని తెలిసింది.లొకేషన్‌లో పాడె కూడా రెడీ చేస్తున్నారు. అది సినిమా కోసమే అయినా.. ఎంతైనా కన్న కొడుకు కదా.. నా మనసుకు బాధగా అనిపించి జగపతి బాబుతో పంచుకున్నా.

మా అబ్బాయిని అలా పాడె మీద చూడలేనయ్యా. తలచుకుంటేనే కాస్త వణుకు వచ్చేస్తోంది. కాస్త అవాయిడ్‌ చేయండి. వాడిని అలా చూస్తే నేను చేయలేనండీ అన్నా. జగపతిబాబు ఒక్క క్షణం ఆలోచించి ‘మరేం ఫర్లేదు కోట గారు.. మీరు రిలాక్స్ అవండి. ఆ సీన్‌లో అక్కడ మీ అబ్బాయి బదులు డూప్‌ని పెడదాం. మీ ఫీలింగ్‌ నాకు అర్థమైంది’ అన్నారు.

kota shares sad moments with jagapathi babu1
kota shares sad moments with jagapathi babu1

ఏ ముహూర్తాన ఆ మాట అన్నానో గానీ వారం రోజుల్లో నా కొడుకు పోయాడు. వారం తిరిగేసరికి నా బిడ్డని అలాగే పాడె మీద చూడాల్సి వచ్చింది. వాడు బైక్‌ మీద వెళ్తుంటే, వెనుక కోడలు, మనవళ్లు కారులో వెళ్తున్నారు.. సడెన్‌గా యాక్సిడెంట్ జరిగింది. మాకు కడుపుకోత మిగిల్చి మా వాడు కన్నుమూశాడు” అని చెబుతూ క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు కోట‌.