Koratala Siva: కొరటాల సంచలన నిర్ణయం.. సోషల్ మీడియాకి గుడ్ బై

Samsthi 2210 - July 1, 2021 / 05:00 PM IST

Koratala Siva: కొరటాల సంచలన నిర్ణయం.. సోషల్ మీడియాకి గుడ్ బై

Koratala Siva: ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోహీరోయిన్లు, డైరెక్టర్లు, నిర్మాతలు సింగర్స్ ఇలా ప్రతిఒక్కరూ తమ ఇమేజ్ ని ఎంజాయ్ చేసేవారు. మూవీ ఈవెంట్స్, సక్సెస్ ఫుల్ ఫంక్షన్స్ లాంటివాటిల్లో అభిమానుల్ని, ప్రేక్షకుల్ని కలిసేవారు. ఆ తర్వాత ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంతోమంది హీరోహీరోయన్లు, డైరెక్టర్లు తమ ఫ్యాన్స్ తో డైరెక్ట్ గా టచ్ లో ఉంటున్నారు.

తమ ప్రొఫెషనల్ ఈవెంట్స్, విశేషాలతో పాటు పర్సనల్ విషయాలను కూడా పంచుకుంటున్నారు. అంతేకాదు తమ ఫ్యాన్స్ తో అప్పుడప్పుడు లైవ్ చాటింగ్ కూడా చేస్తూ మరింత చేరువగా ఉంటున్నారు. అయితే ఈ సోషల్ మీడియాలో నెటిజన్ల నుండి పాజిటివిటీ ఎంతైతే ఉంటుందో.. నెగిటివిటీ కూడా అంతే ఉంటుంది.

తమ ఫేవరెట్ అభిమానుల్ని పొగిడేవారు.. హైప్ క్రియేట్ చేసేవారు ఎంత మందైతే ఉంటారో.. కమెంట్స్ చేసేవారు కూడా అంతే ఉంటారు. ఈ క్రమంలో ఎంతోమంది తమకు నెగిటివ్ కమెంట్స్ చేసేవారిని బ్లాక్ చేస్తుంటారు. ఇంకొన్ని సందర్భాల్లో అయితే సోషల్ మీడియాకు దూరమవుతుంటారు. అయితే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సోషల్ మీడియా నుండి దూరమవబోతున్నారు.

siva 1

ఈ క్రమంలో ఆయనే స్వయం గా ఈ విషయాన్ని తన అభిమానులకు తెలియజేశారు. ఆయన అధికారిక సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో.. తాను సోషల్ మీడియా నుండి దూరమవుతున్నానని, ఇంతవరకు తాను ఎన్నో విషయాలను నెటిజన్లతో షేర్ చేసుకున్నానని, కానీ ఈసారికి తాను సోషల్ మీడియాకు దూరమవుతున్నానని అన్నారు.

అయితే తన మీడియా స్నేహితులతో తన సినిమా విషయాలను ఎప్పటికప్పుడూ పంచుకుంటానని.. తమ ప్రొఫెషనల్ విశేషాలను షేర్ చేసుకుంటానని అన్నారు. తాను ప్రేక్షకుల నుండి ఎన్నటికీ దూరం కానని.. కేవలం సోషల్ మీడియా నుండే దూరమవుతున్నానని అన్నారు. ఇక ఇటీవల కాలంలో సోషల్ మీడియాకు అమీర్ ఖాన్ కూడా దూరమయ్యారు. మరికొంతమంది హీరోయిన్లు కూడా ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్స్ కు దూరంగా ఉంటున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us