Konda Polam: బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అల‌రించ‌లేని కొండ‌పొలం బుల్లితెర‌పై ప్ర‌తాపం చూపించిందిగా…!

Konda Polam: మెగా ఫ్యామిలీ నుండి వ‌చ్చిన వైష్ణ‌వ్ తేజ్ ఉప్పెన సినిమాతో వెండితెరకు ప‌రిచ‌య‌మైన విష‌యం తెలిసిందే. ఈ సినిమా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెర‌కెక్క‌గా, తన తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. తొలి సినిమా ఉప్పెన రిలీజ్ కాకముందే తన నెక్స్ట్ సినిమాకొండపొలం కూడా పూర్తి చేశారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గ‌త ఏడాది అక్టోబర్ 8న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందింది.

konda polam gets huge response in small screen
konda polam gets huge response in small screen

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు ఈ మూవీ ప్రేక్షకుల అల‌రించిన‌, కమర్షియల్‌ హిట్‌ అందుకోలేదు. ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమా రీసెంట్‌గా స్టార్‌ మాలో ప్రసారమైంది. బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తూ మంచి టీఆర్పీ దక్కించుకుంది కొండపొలం.

అర్బన్‌ ఏరియాలో 12.34 టీఆర్పీ రాగా అర్బన్‌, రూరల్‌ ప్రాంతాల్లో మొత్తం కలిపి 10.54 రేటింగ్‌ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ దగ్గర అంతంత మాత్రమే ఆడిన కొండపొలం ఈ స్థాయిలో రేటింగ్‌ రాబట్టుకోవడం విశేషమే అంటున్నారు సినీలవర్స్‌. ఇక ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, సాయిచంద్‌, హేమ, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

konda polam gets huge response in small screen2
konda polam gets huge response in small screen2

క్రిష్ ఈ సినిమాను కేవలం 40 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారట. ఈ చిత్రాన్ని వికారాబాద్ ఫారెస్ట్‌లో ఎక్కువు శాతం చిత్రీకరించారు. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఆహా స్ట్రీమింగ్ సంస్థ దక్కించుకుంది. ఈ సినిమాను 7.5 కోట్ల రేటుకి అమ్మగా సినిమా 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది.

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో ఓ చిత్రం రూపు దిద్దుకోవటానికి రంగం సిద్ధమైంది. నేడు వైష్ణవ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర నిర్మాతలు ఈ మేరకు అధికారిక ప్రకటన ఓ వీడియో రూపంలో విడుదల చేశాయి. తొలి చిత్రం తోనే స్టార్ గా ప్రేక్షక హృదయాలలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ లేటెస్ట్ మాస్ లుక్ ఆకట్టుకుంది.